Padma Kasturi Rangan has been appointed as the new head of Amazon Prime Video South India Originals
ఇటీవల రానా హోస్ట్ గా ది రానా దగ్గుబాటి షో అనే పేరు తో అమేజాన్ ప్రైమ్ ఓటీటీలో సరికొత్త టాక్ షో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ షో ప్రమోషన్స్ లో రానా పద్మ కస్తూరి రంగన్ అనే మహిళ గురించి చెప్తూ ఆమె వల్లే ఈ షో వస్తుందని, ఆమె వల్లే షో సక్సెస్ అవుతుందని అన్నారు.
Also Read : Naga Chaitanya : తల్లి చేతుల మీదుగా పెళ్ళికొడుకు.. తల్లి,మామలతో నాగచైతన్య పెళ్లి ఫోటోలు వైరల్..
తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో సౌత్ ఇండియా ఒరిజినల్స్‌కు పద్మ కస్తూరి రంగన్‌ను కొత్త హెడ్‌గా నియమించారు. ఈమె రెండు సంవత్సరాల క్రితం ప్రైమ్ వీడియోలో చేరగా తన వర్క్ తో ఈ స్థాయికి చేరారు. గత సంవత్సరం నాగచైతన్య దూత సిరిస్ సక్సెస్ వెనుక కూడా ఆమె ముఖ్య కారణం.
పద్మ కస్తూరి రంగన్ న్యూయార్క్ యూనివర్శిటీలో తన ఫిల్మ్ కోర్సు పూర్తి చేసి అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్‌లో తన కెరీర్‌ను ప్రారంభించింది. అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఫిల్మ్ స్కూల్ లో కీలక బాధ్యతలు నిర్వహించి అనంతరం తమడ మీడియాలో లాంగ్ ఫారమ్ వింగ్‌కు అధిపతిగా చేసారు. అనంతరం ప్రైమ్ లో జాయిన్ అయ్యారు. ప్రైమ్ లో పలు వెబ్ సిరీస్ లు, షోలు సక్సెస్ అవ్వడంలో కీలక పాత్ర పోషించారు ఈమె.
తాజాగా ప్రైమ్ సౌత్ ఇండియా ఒరిజినల్స్ హెడ్ గా తనను నియమించడంపై ఆమె స్పందిస్తూ.. అమెజాన్ ప్రైమ్ వీడియో టీమ్ కి థ్యాంక్స్. సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను అలరించేందుకు, ప్రైమ్ వీడియోను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కష్టపడతానని, ప్రేక్షకులు కోరుకున్న మరింత బలమైన కథలను కొత్తగా మీ ముందుకు తెస్తామని తెలిపారు. ఇక పద్మ కస్తూరి రంగన్ కు అమెజాన్ ప్రైమ్ వీడియో సౌత్ ఇండియా ఒరిజినల్స్‌కు పద్మ కస్తూరి రంగన్‌ను కొత్త హెడ్‌గా నియమించినందుకు కంగ్రాట్స్ తెలుపుతూ రానా ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేశారు.