Alia Bhatt : ఇందుకు కాదు పాకిస్థాన్ వాళ్ళని తిట్టేది.. AI ని వాడి మన హీరోయిన్ ని.. తిట్టినా సమర్ధించుకుంటూ..

నిజం తెలిసిన తర్వాత ఆ పాకిస్థాన్ బ్రాండ్ ని అందరూ తిడుతున్నారు. (Alia Bhatt)

  • Published on- April 22, 2026 / 04:12 PM IST

Alia Bhatt

Alia Bhatt : తాజాగా ఓ పాకిస్థాన్ క్లాత్ బ్రాండ్ చేసిన పనికి అందరూ తిడుతున్నారు. పాకిస్థాన్ కి చెందిన వజేషా అనే క్లాతింగ్ బ్రాండ్ చేసిన పనికి మొదట హీరోయిన్ అలియా అబాట్ ని అందరూ తిట్టారు. కానీ నిజం తెలిసిన తర్వాత ఆ పాకిస్థాన్ బ్రాండ్ ని అందరూ తిడుతున్నారు.

ఇంతకీ ఈ పాకిస్థాన్ బ్రాండ్ వజేషా క్లాతింగ్ ఏం చేసిందంటే.. తమ దగ్గర దొరికే కొన్ని ట్రెడిషినల్ పంజాబీ డ్రెస్ లని బాలీవుడ్ భామ అలియా భట్ వేసుకొని మోడల్ గా ఆ బ్రాండ్ కి ప్రమోషన్ చేసినట్టు ఫోటోలు షేర్ చేసింది. అలియాభట్ ఫోటోలు షేర్ చేస్తూ.. మా ప్యూర్ శీషా సిల్క్ కలెక్షన్ అంటే అలియా భట్ కు కూడా ఇష్టం. అందుకే మీరు మీకు నచ్చిన రంగుల్లో దుస్తులను ఆర్డర్ చేయండి అంటూ తమ బ్రాండ్ ని ప్రచారం చేసుకుంది.

Also Read : Nagababu : రీ ఎంట్రీతోనే సంచలన కామెంట్స్.. ఒక్కోసారి వీళ్ళని కొట్టాలనిపించేది.. జబర్దస్త్‌లో నాగబాబు..

దీంతో అలియా భట్ పాకిస్థాన్ బ్రాండ్ కి ప్రచారం చేయడం ఏంటి అని కొంతమంది నిజం తెలుసుకోకుండానే అలియాని విమర్శించారు. అయితే అసలు అలియా భట్ ఆ బ్రాండ్ కి ప్రచారం చేయలేదు. ఆ బ్రాండ్ వాళ్లే AIలో అలియా భట్ కి వాళ్ళ దగ్గరున్న డ్రెస్ డిజైన్ లను వేసి ఆ ఫోటోలను ప్రమోషన్స్ గా వాడారు. దీంతో ఈ విషయం తెలిసి ఆ పాకిస్థాన్ బ్రాండ్ ని తిట్టడం మొదలుపెట్టారు. ఇలా పర్మిషన్ లేకుండా సెలబ్రిటీ ఫోటోని AI లో వాడటం తప్పని అంటే, పాకిస్థాన్ వాళ్ళు ప్రమోషన్స్ కోసం ఇండియన్ హీరోయిన్స్ ని వాడుకోవాల్సి వస్తుంది అని మరికొంతమంది విమర్శిస్తున్నారు.

అయితే విమర్శలు వచ్చినా వజేషా క్లాతింగ్ బ్రాండ్ అలియా భట్ చేయకపోతే ఏమైంది ఆ కలెక్షన్స్ మాత్రం నిజమే. వైరల్ అయితే మంచిదే కదా అంటూ తాము చేసిన ఈ పనిని సమర్ధించుకుంటుంది. దీనిపై అలియా మాత్రం ఇంకా స్పందించలేదు.