Nagababu : రీ ఎంట్రీతోనే సంచలన కామెంట్స్.. ఒక్కోసారి వీళ్ళని కొట్టాలనిపించేది.. జబర్దస్త్లో నాగబాబు..
రీ ఎంట్రీ ఇస్తూనే నాగబాబు జబర్దస్త్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. (Nagababu)
Nagababu
Nagababu : ఒకప్పుడు జబర్దస్త్ షోకి జడ్జిగా ముందుండి నడిపించిన నాగబాబు ఆ తర్వాత నిర్మాణ సంస్థతో విబేధాల కారణంగా తప్పుకున్నారు. ఆ తర్వాత జనసేన, రాజకీయాలు.. ఇలా ఇన్నాళ్లు బిజీగా ఉండి దూరమయ్యారు. తాజాగా నాగబాబు మళ్ళీ జబర్దస్త్ లో రీ ఎంట్రీ ఇచ్చారు. నాగబాబు రీ ఎంట్రీ ఇచ్చిన ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజయింది.
అయితే రీ ఎంట్రీ ఇస్తూనే నాగబాబు జబర్దస్త్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నాగబాబు రీ ఎంట్రీ ఇవ్వడంతో యాంకర్ రష్మీ జడ్జి చైర్ ని ఉద్దేశించి.. ఆ చైర్ లోకి ఎంతమంది వచ్చినా ఎప్పటికి ఆ చైర్ మీకే సొంతం అని అంది.
Also See : Shivani Nagaram: నీలి రంగు దుస్తుల్లో మెరిసిపోతున్న శివాని నాగారం.. ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
దీంతో నాగబాబు మాట్లాడుతూ.. నేను జడ్జిగా జబర్దస్త్ కి దూరమయినా షోకి ఎప్పుడూ దూరమవ్వలేదు. జబర్దస్త్ ని చూస్తూనే ఉంటాను. ఒక్కోసారి కమెడియన్స్ సరిగ్గా చేయకపోతే వచ్చి మరీ కొట్టాలనిపించేది. ఇండస్ట్రీలో కమెడియన్స్ తగ్గినప్పుడు జబర్దస్త్ కమెడియన్స్ ని పంపింది అని అన్నారు. ఇక నాగబాబు రీ ఎంట్రీతో ఆయన స్టైల్ నవ్వులు మళ్ళీ మొదలయ్యాయి. మరి రెగ్యులర్ గా కంటిన్యూ అవుతారా? లేక కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే కనిపిస్తారా చూడాలి.
నాగబాబు రీ ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమో మీరు కూడా చూసేయండి..
