Palla Srinivasa Rao Interesting Comments on Allu Arjun and Film Industry
Palla Srinivasa Rao : అల్లు అర్జున్ – సంధ్య థియేటర్ ఘటన నిన్నటి నుంచి మరింత వైరల్ అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడటం, దానికి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం వైరల్ అవ్వడంతో పలువురు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఏపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు.
తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మీడియాతో అల్లు అర్జున్ ఘటనపై మాట్లాడుతూ.. పుష్ప2 సినిమా తొక్కిసలాట ఘటనలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తుంది. అల్లు అర్జున్ సినిమా థియేటర్ కు వస్తున్నారని సమాచారం ఉన్నా ముందస్తు ఏర్పాట్లు చేసుకోకపోవడం ఎవరి తప్పు, బెనిఫిట్ షోలు రద్దు చేయాలనే నిర్ణయం సరైనది కాకపోవచ్చు. నేను కూడా పుష్ప 2 సినిమాకు వెళ్ళాను కానీ అభిమానుల హడావిడి వలన సినిమా చూడలేకపోయాను. ఒకరిని ఒకరు తప్పు పట్టడం కన్నా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటే మంచిది అని అన్నారు.
అలాగే.. సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుందని మా ఉప ముఖ్యమంత్రి పవన్ చెప్పారు. సినీ పరిశ్రమ ఏపీకి వస్తే స్వాగతిస్తాం. ఏపీలో ఎన్నో అందమైన షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి. హైదరాబాద్ ఇప్పుడు చాలా రద్దీ అయింది. ఇలాంటి సమయంలో ఇంకోచోట డెవలప్ జరిగితే బాగుంటుంది. ఇక్కడికి కూడా సినీ పరిశ్రమ వస్తే ఇక్కడ కూడా డెవలప్ అవుతుంది. ఇక్కడ కూడా ఎంప్లొయీమెంట్ జరుగుతుంది. మా ఉపముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా పరిగణించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. దీంతో పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.