Sukumar : ఒకే ఒక్క హీరో చరణ్.. రంగస్థలంకు నేషనల్ అవార్డు వస్తుందనుకున్నా.. అమెరికాలో ‘గేమ్ ఛేంజర్’ రివ్యూ ఇచ్చిన సుకుమార్..
అమెరికా ఈవెంట్లో సుకుమార్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Sukumar Interesting Comments on Ram Charan and Game Changer in America Event
Sukumar : నేడు గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి భారీగా చరణ్ ఫ్యాన్స్, అక్కడి తెలుగు ప్రజలు వచ్చారు. ఈ ఈవెంట్ కు డైరెక్టర్ సుకుమార్ గెస్ట్ గా వచ్చారు. ఈవెంట్లో సుకుమార్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : Allu Arjun : ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ విజ్ఞప్తి.. ఫ్యాన్స్ ముసుగులో అలా చేస్తే చర్యలు తీసుకోబడతాయి..
సుకుమార్ మాట్లాడుతూ.. నేను ప్రతి హీరోని సినిమా చేస్తున్నప్పుడు ప్రేమిస్తాను. ఆ హీరోతో ఒక రెండేళ్లు ట్రావెల్ చేస్తాను. సినిమా అయినంతసేపు ఆ హీరోతో కనెక్ట్ అవుతాను. సినిమా అయ్యాక నేనెవరితో కనెక్ట్ అయి ఉండను. కానీ రంగస్థలం అయిన తర్వాత కూడా ఆ అనుబంధం అలాగే కొనసాగిన ఒకే ఒక్క హీరో రామ్ చరణ్. నాకు చరణ్ అంటే చాలా ఇష్టం. నా బ్రదర్ లాంటి వాడు. మీకు ఒక రహస్యం చెప్తాను. చిరంజీవి సర్ తో కలిసి నేను ఈ సినిమా చూసాను. ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తాను మీకు. ఫస్ట్ హాఫ్ అద్భుతం. ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్. సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తే గూస్ బంప్స్. శంకర్ గారి సినిమాలు జెంటిల్మెన్, భారతీయుడు చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేసానో ఈ సినిమా అప్పుడు అంత ఎంజాయ్ చేశాను. రంగస్థలం సినిమాకు కంపల్సరీ నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నాను చరణ్ కి. కానీ ఈ సినిమా క్లైమాక్స్ లో తన ఎమోషన్ చూసినప్పుడు నాకు అదే ఫీలింగ్ కలిగింది. ఎంత బాగా చేసాడంటే దీనికి కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది అని అన్నారు. దీంతో సుకుమార్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Game Changer 1️⃣st REVIEW:
National Award for Ram Charan✅
Awesome 1st half, blockbuster interval, phenomenal flashback in 2nd half. Climax🔥 pic.twitter.com/6ZBce4hLjW
— Manobala Vijayabalan (@ManobalaV) December 22, 2024
ఇక సుకుమార్ – చరణ్ కాంబోలో RC17 సినిమా రానుంది. సుకుమార్ త్వరలోనే ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టనున్నాడు. చరణ్ బుచ్చిబాబు సినిమా షూట్ అవగానే సుకుమార్ షూట్ మొదలుపెట్టనున్నాడు.