Paluke Bangaramayana Serial starts from august 21st in Star Maa
Paluke Bangaramayana : భవిష్యత్తు ఎన్నో కలలను చూపిస్తుంది. ఎన్నో ఆశలను నేర్పిస్తుంది. ఏదో సాధించగలమన్న నమ్మకాన్ని ఇస్తుంది. ఈ కథతో స్టార్ మా ప్రారంభిస్తున్న సరికొత్త సీరియల్ “పలుకే బంగారమాయెనా”. రెండు కలలు నడిచి నిజాలుగా మార్చుకున్న కథ ఇది. పుట్టుకతో పరాజితులే గానీ పట్టుదలతో ఇద్దరూ విజేతలుగా ఎలా నిలబడ్డారు అనే విలక్షణ మైన కథతో ఆగష్టు 21 నుంచి మ.1.30 గంటలకు స్టార్ మా ప్రేక్షకులను అలరించబోతోంది ఈ సీరియల్.
గెలుపే గమ్యమైన ఇద్దరి ప్రయాణంలో ఎన్ని మలుపులు, ఎన్నిమజిలీలు వుంటాయో, ఎన్ని అవరోధాలు, అడ్డంకులువుంటాయో చెప్పిన ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇది. ఏదో సాధించాలనే తపన వున్నా తన లోపం వల్ల ఆమె ముందడుగు వేయలేని నిస్సహాయ పరిస్థితి. అయితే, ఆమె జీవితంలోకి అతని రాక ఒక మలుపు కాదు.. అనుకోని మజిలీ. అతని ప్రేమ, ప్రేరణ ఆమె ఆశయాన్ని ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడాయి. పెంచి పెద్ద చేసాయి. అతని సహాయ సహకారాలు ఈ అమ్మాయి అనుకున్నఉన్నత స్థానానికి ఎలా తీసుకువెళ్లాయి అనేది “పలుకే బంగారమాయెనా” కథ.
తడబడే అడుగుల నుంచి వడివడినడకలా వరకు ఒక జంట ఎంత అపురూపంగా ప్రయాణంచేసిందో అద్భుతంగా చెప్పిన ధారావాహిక స్టార్ మా ప్రేక్షకులను ఉర్రూతలూగించబోతోంది. ఓడించాలనుకున్న జీవితాన్నిగెలుచుకున్న ఆ ఇద్దరూ, వాళ్ళ కుటుంబాలు తెలుగు లోగిళ్ళలో ప్రతి కుటుంబానికి నచ్చుతాయి. ఈ సీరియల్ ఆగష్టు 21 నుంచి మ.1.30 గంటలకు స్టార్ మా లో అందర్నీ అలరించబోతుంది.