Aadi Keshava : వైష్ణవ తేజ్ ‘ఆదికేశవ’ న్యూ రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకుంది.. కొత్త తేదీ..?
రిలీజ్ వాయిదా వేసుకున్న వైష్ణవ తేజ్ 'ఆదికేశవ' ఏకంగా రెండు నెలలు వెనక్కి వెళ్ళింది.
- gum 95921
- Published On : August 18, 2023 / 05:44 PM IST
Panja Vaishnav Tej Sreeleela movie Aadi Keshava release date
Aadi Keshava : మెగా హీరో వైష్ణవ తేజ్ (Panja Vaisshnav Tej) డెబ్యూ మూవీ ‘ఉప్పెన’తోనే 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే ఆ తరువాత వచ్చిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సత్తా చాటలేకపోయాయి. దీంతో తదుపరి సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. తన కెరీర్ లో నాలుగో సినిమాగా తెరకెక్కుతున్న ‘ఆదికేశవ’ మాస్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తుంటే మలయాళ స్టార్ యాక్టర్ ‘జోజు జార్జ్’ (Joju George) విలన్ కనిపించబోతున్నాడు.
Varun Tej : ఈసారి ఎన్నికల్లో పవన్‌కి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయనుందా..? వరుణ్ తేజ్ ఏం చెప్పాడు..?
కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ఆగస్టు 18న ఈ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తామంటూ గతంలో ప్రకటించారు. అయితే ఆగష్టులో అనేక సినిమాల రిలీజ్ ఉండడంతో మూవీని పోస్ట్‌పోన్ చేసుకున్నారు. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలియజేసిన మేకర్స్.. తాజాగా న్యూ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ ఒక రొమాంటిక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. మూవీని ఏకంగా రెండు నెలలు వెనక్కి తీసుకు వెళ్లారు. నవంబర్ 10న ఈ మూవీని విడుదల చేయనున్నారు.
Vijay Jagarlamudi : స్వాతంత్య్ర సమరయోధుడి బయోపిక్ తీసి.. గుండెపోటుకు గురైన సినీ నిర్మాత..
సెప్టెంబర్ లో సలార్, ఖుషి, స్కంద, జవాన్.. వంటి పాన్ ఇండియా రిలీజ్ లతో ఫుల్ బిజీగా ఉంది. అలాగే అక్టోబర్ లో కూడా భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో వంటి సినిమా రిలీజ్ లు ఉన్నాయి. అందువలనే ఆదికేశవ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెండు నెలలు ఎదురు చూడాల్సి వస్తుంది. కాగా ఈ సినిమా కథ ఒక ఊరిలోని శివుడి గుడిని హీరో రక్షించడంపై ఉండబోతుందని తెలుస్తుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాని సంయుక్త నిర్మిస్తుండగా శ్రీకర స్టూడియోస్ చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. జి వి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Panja Vaishnav Tej Sreeleela movie Aadi Keshava release date
