Payal Radhakrishna: నేను తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను.. మనసులో మాట చెప్పిన పాయల్ రాధాకృష్ణ
పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన పాపం ప్రతాప్ హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ(Payal Radhakrishna).
- V Santhosh Kumar
- Updated on- May 7, 2026 / 06:29 PM IST
payal radhakrishna interesting comments about her marriage
- నాకు తెలుగు అబ్బాయే కావాలి.
- తెలుగువారే నాకు అన్నీ ఇచ్చారు.
- పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన పాయల్ రాధాకృష్ణ
Payal Radhakrishna: టాలీవుడ్ యంగ్ హీరో త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మధుదీప్ చెలికాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండెం నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులలో మంచి ఆసక్తిని రేకెత్తించాయి. మే 15న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేస్తూ తాజాగా ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది.
Nabha Natesh: కళ్లు చెదిరే ఫిజిక్‌తో మెరిసిపోతున్న నభా.. జిమ్ లుక్ ఫోటొలు వైరల్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కథానాయిక పాయల్ రాధాకృష్ణ(Payal Radhakrishna) తన వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన పెళ్లి గురించి స్పందిస్తూ, తనకు తెలుగు అబ్బాయి అంటేనే ఇష్టమని మనసులో మాట బయటపెట్టారు. తనకు గుర్తింపు, గౌరవం, ఉపాధిని ఇచ్చింది టాలీవుడ్ పరిశ్రమనే అని ఆమె ఎంతో భావోద్వేగంతో తెలిపారు. తెలుగు ప్రేక్షకులు చూపించే ఆదరణ వల్లే తను ఈ స్థాయిలో ఉన్నానని, అందుకే తన జీవిత భాగస్వామి కూడా ఇక్కడి వాడే కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్ నగరం, తెలుగు భాషపై తనకున్న మమకారాన్ని చాటుకుంటూ, తన హృదయం ఎప్పుడూ ఇక్కడే ఉంటుందని పాయల్ పేర్కొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ తనకు శాంతిని, ఆర్థిక భరోసాను ఇచ్చిందని, అందుకే ఈ రంగాన్ని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒక పక్కా తెలుగు కోడలిగా స్థిరపడాలన్న ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వృత్తిపరంగా ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ సినిమా తనకు పెద్ద బ్రేక్ ఇస్తుందని ఆమె ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
