Paresh Rawal : నేను చనిపోలేదు…ఎక్కువ సేపు నిద్రపోయాను – పరేష్ రావల్
ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్. ఆయన చనిపోయినట్లు శుక్రవారం ఉదయం తెగ ప్రచారం జరిగింది. ట్విట్టర్ వేదికగా ఎవరో దీనిని పోస్టు చేశారు. చివరికు ఆయన రెస్పాండ్ కావాల్సి వచ్చింది.
- madhu
- Published On : May 15, 2021 / 05:23 PM IST
Paresh
Death Hoax : బతికి ఉండగానే..కొంతమంది చనిపోయారంటూ..ప్రచారం చేస్తుంటారు. అయ్యో తాము బతికే ఉన్నామని వాళ్లు ముందుకు వచ్చి..చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. సోషల్ మీడియా ద్వారా..ఇతర మాధ్యమాల ద్వారా..వీడియోలను పోస్టు చేస్తుంటారు. ఇలాగే..జరిగింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్. ఆయన చనిపోయినట్లు శుక్రవారం ఉదయం తెగ ప్రచారం జరిగింది. ట్విట్టర్ వేదికగా ఎవరో దీనిని పోస్టు చేశారు. చివరికు ఆయన రెస్పాండ్ కావాల్సి వచ్చింది. విలక్షణ నటుడు కావడంతో సరదాగా స్పందించారు.
అపోహ కలిగించినందుకు మన్నించాలి. ఉదయం 7 దాటి నిద్రపోయానంతే అంటూ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. ఆ మెసేజ్ కు ముందు రెండు చేతులా దండం పెట్టే ఇమోజీని కూడా పెట్టారు. దీనిపై నె టిజన్లు కూడా రెస్పాండ్ అయ్యారు. కొంతమంది శతమానం భవతి అని అంటే..ట్వీట్ పెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
పరేష్ రావల్.. విలన్‌గా, కామెడీ నటుడిగా అభిమానులను అలరించారు. బాలీవుడ్ లోనే కాకుండా, తెలుగు చిత్రాల్లో కూడా నటించి మన్ననలు పొందారు. రామ్ గోపాల్ వర్మ తీసిన ‘మనీ’, ‘గోవింద గోవింద’ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాతో ఆయన నటన..సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.
అటు సినిమాల్లోనే కాకుండా..రాజకీయాల్లో కూడా అడుగు పెట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున అహ్మదాబాద్ ఈస్ట్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం పరేష్ రావల్.. ‘హంగామ-2’, ‘తూఫాన్’, ‘ది స్టోరీ టెల్లర్’ చిత్రాల్లో నటిస్తున్నారు.
Read More : Indias Covid : భారత్ లో కరోనా సెకండ వేవ్, WHO తీవ్ర ఆందోళన
?…Sorry for the misunderstanding as I slept past 7am …! pic.twitter.com/3m7j8J54NF
— Paresh Rawal (@SirPareshRawal) May 14, 2021
