Parineeti Chopra : వీడియో గిఫ్ట్ ఇచ్చి భర్తని సర్ప్రైజ్ చేసిన పరిణీతి చోప్రా.. ఆ వీడియో చూశారా..?
పెళ్లి తరువాత భర్తకు మొదటి బహుమతి ఇచ్చి సర్ప్రైజ్ చేసిన పరిణీతి చోప్రా. ఆ వీడియో మీరు చూశారా..?
- gum 95921
- Published on- September 29, 2023 / 07:30 PM IST
Parineeti Chopra first gift to Raghav Chaddha gone viral
Raghav Chaddha – Parineeti Chopra : ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ (Bollywood) నటి పరిణీతి చోప్రా ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో ఘనంగా నిశ్చతార్థం చేసుకొని ఎంగేజ్మెంట్ రింగులు మార్చుకున్న ఈ జంట.. 2023 సెప్టెంబర్ 24న ఏడడుగులు వేసి పెళ్లి జీవితాన్ని మొదలు పెట్టారు. ఇక ఆ పెళ్లికి సంబంధించి ఫోటోలు, వీడియోలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. ఇటీవల ఒక వీడియో బయటకి రాగా.. దానిలో పరిణీతి సంతోషం డ్యాన్స్ వేస్తూ కనిపించింది.
Jyothi Rai : టాలీవుడ్ డైరెక్టర్ని పెళ్లాడబోతున్న ‘గుప్పెడంత మనసు’ జగతి మేడం..
ఇక పెళ్లి తరువాత పరిణీతి తన భర్తకు మొదటి బహుమతిని అందించింది. పెళ్లి వేడుకకు సంబంధించిన ఒక వీడియోని షేర్ చేస్తూ.. “టు మై హస్బెండ్” అంటూ పోస్ట్ చేసింది. ఇక ఈ బహుమతి చూసిన రాఘవ చద్దా.. ఆ వీడియోని రీ షేర్ చేస్తూ.. “ఇలాంటి ఒక బహుమతి అందుకుంటానని నేను ఎప్పుడు అనుకోలేదు. నా సింగర్ వైఫ్ నన్ను సర్ప్రైజ్ చేసింది. నేను వాయిస్ నా లైఫ్, మన లైఫ్ కి సౌండ్ ట్రాక్ అయ్యిపోయింది. నువ్వు నాతో ఉండడాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను” అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చాడు. ఈ వీడియోలో పరిణీతి తెగ సందడి చేస్తూ కనిపించింది. తన పెళ్లిని తనే అల్లరి అల్లరిగా, సందడిగా జరిపించుకుంది.
కాగా రాజస్ధాన్ ఉదయ్‌పూర్ (Udaipur) లోని లీలా ప్యాలెస్ లో జరిగిన వీరి వివాహం మూడు రోజుల పాటు ఘనంగా జరిగింది. మెహందీ, హల్దీ, సంగీత్ అంటూ ఇరు కుటుంబసభ్యులతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి బంధుమిత్రులతో పాటు బాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యి కొత్త జంటకి తమ అశీసులు అందజేశారు. ఇక ఈ వివాహంలో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హాజరయ్యి రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రాని ఆశీర్వదించారు.
