×
Ad

Market Mahalakshmi : మార్కెట్ మహాలక్ష్మితో మజాక్ లాడితే మంచిగుండదు.. హీరో చెంపలు వాయించిన తల్లి, లవర్..

ఇప్పటికే టైటిల్, పోస్టర్స్ తో ఇంటరెస్టింగ్ గా అనిపించిన మార్కెట్ మహాలక్ష్మి సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేసారు.

  • Published On : February 23, 2024 / 04:58 PM IST

Parvateesam Market Mahalakshmi Movie Teaser Released by Hero Sree Vishnu

Market Mahalakshmi Teaser : కేరింత మూవీ ఫేమ్ పార్వతీశం(Parvateesam) హీరోగా, ప్రణీకాన్వికా హీరోయిన్ గా కొత్త దర్శకుడు వియస్ ముఖేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మార్కెట్ మహాలక్ష్మి’. అఖిలేష్ కలారు బి2పి స్టూడియోస్ నిర్మాణంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టైటిల్, పోస్టర్స్ తో ఇంటరెస్టింగ్ గా అనిపించిన మార్కెట్ మహాలక్ష్మి సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేసారు.

మార్కెట్ మహాలక్ష్మి టీజర్ లో.. ఓ కూరగాయల అమ్మాయి కూరగాయలు కొనడానికి వచ్చిన కస్టమర్ తో గొడవ పడుతుంది. ఆమె నా కొడుకుని పిలుస్తా అంటే హీరో వచ్చి కూరగాయలు అమ్మే అమ్మాయికి ఐ లవ్ యు చెప్తాడు. దీంతో హీరోయిన్, లవర్ ఇద్దరూ హీరో చెంపలు వాయిస్తారు. మార్కెట్ మహాలక్ష్మితో మజాక్ లాడితే మంచిగుండదు అని హీరోయిన్ డైలాగ్ విసురుతుంది. ఇలా టీజర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. ఓ సాఫ్ట్‌వేర్ అబ్బాయి కూరగాయలమ్మే అమ్మాయిని ప్రేమించి, ఆ అమ్మాయి ప్రేమని ఎలా పొందాడు అనే కథాంశంతో ఈ సినిమా రాబోతుంది.

Also Read : Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’లో.. ఆ ఇద్దరు హీరోయిన్స్ కూడా..? పదేళ్ల తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..?

ఇక టీజర్ ని హీరో శ్రీవిష్ణు రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ అనంతరం శ్రీవిష్ణు మాట్లాడుతూ.. మార్కెట్ మహాలక్ష్మి టీజర్ చాలా ఫన్నీ గా ఉంటూనే హీరో, హీరోయిన్ క్యారెక్టరైజెషన్ బాగుంది. పార్వతీశం కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఈ సినిమాలోని వారందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అంటూ చిత్రయూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలిపారు.