Pathaan movie sets new record over Bahubali 2 and KGF 2
Pathaan : నాలుగేళ్ల గ్యాప్ తర్వాత షారుఖ్ పఠాన్ సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. షారుఖ్, దీపికా జంటగా జాన్ అబ్రహం విలన్ గా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ సినిమా జనవరి 25 న రిలీజయి మంచి విజయం సాధించింది. ఇప్పట్లో వేరే ఏ సినిమాలు లేకపోవడం, షారుఖ్ నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత యాక్షన్ సినిమాతో రావడంతో సినిమాకి కలెక్షన్స్ భారీగా వస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే కలెక్షన్స్ ఓ రేంజ్ లో వచ్చాయి.
మొదటి రోజే పఠాన్ సినిమా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. నాలుగు రోజుల్లో 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అంటే దాదాపు 200 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పటికే పలు రికార్డులని సెట్ చేస్తుంది పఠాన్ సినిమా. తాజాగా మరో సరికొత్త రికార్డుని సెట్ చేసింది పఠాన్. అత్యంత ఫాస్ట్ గా 200 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసిన ఇండియన్ సినిమాగా పఠాన్ రికార్డ్ సాధించింది.
Tarakarathna : విషమంగా తారకరత్న ఆరోగ్యం.. నేడు బెంగళూరుకు జూ.ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్..
పఠాన్ సినిమా రిలీజయిన నాలుగు రోజుల్లోనే ఈ ఫీట్ సాధించింది. అంతకుముందు KGF 2 అయిదు రోజుల్లో, బాహుబలి 2 ఆరు రోజుల్లో రికార్డుని సాధించగా ఇప్పుడు పఠాన్ వాటిని అధిగమించింది. ఇవాళ ఆదివారం కావడంతో సినిమాకి ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. షారుఖ్ పఠాన్ ఇవాళ్టికి 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేస్తుందని బాలీవుడ్ అంచనా. పఠాన్ సినిమా ఈ రేంజ్ లో కెల్క్షన్స్ వసూలు చేయడంతో కింగ్ ఈజ్ బ్యాక్ అని అభిమానులు, బాలీవుడ్ ఈజ్ బ్యాక్ అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరెన్ని రికార్డులు సెట్ చేస్తుందో పఠాన్ సినిమా చూడాలి.
‘PATHAAN’ OVERTAKES ‘KGF2’, ‘BAAHUBALI 2’… FASTEST TO ENTER ₹ 200 CR CLUB…
⭐️ #Pathaan: Day 4 [Sat]
⭐ #KGF2 #Hindi: Day 5
⭐ #Baahubali2 #Hindi: Day 6#India biz.#Pathaan is truly rewriting record books. pic.twitter.com/w5y07xKRnI— taran adarsh (@taran_adarsh) January 28, 2023