Pathaan : సెకండ్ వీకెండ్‌లో కూడా తగ్గని పఠాన్ కలెక్షన్స్.. కేజీఎఫ్-2 రికార్డు బ్రేక్?
కింగ్ ఖాన్ షారుఖ్ 'పఠాన్' సినిమా రికార్డులు వేట ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొదటి రోజు నుంచే ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో దూకుడు చూపిస్తుంది. రెండో వీకెండ్ లో కూడా ఈ చిత్రం..
- gum 95921
- Published On : February 7, 2023 / 04:17 PM IST
pathaan
Pathaan : కింగ్ ఖాన్ షారుఖ్ ‘పఠాన్’ సినిమా రికార్డులు వేట ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమా తరువాత సరైన హిట్ లేని షారుఖ్ ఖాన్ నుంచి ఒక సాలిడ్ కామ్ బ్యాక్ ఎదురు చూస్తున్న అభిమానులకు పఠాన్ సినిమాతో గుర్తుండిపోయే ట్రీట్ ఇచ్చాడు. బాలీవుడ్ డాన్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసే యాక్షన్ మార్క్ ఈ మూవీలో కనిపించింది. థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఫ్యాన్స్ ని థ్రిల్ చేసాడు దర్శకుడు. మొదటి రోజు నుంచే ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో దూకుడు చూపిస్తుంది. ఫస్ట్ డేనే రూ.100 కోట్ల ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం రోజుకో 100 కోట్ల చొప్పున 6 రోజుల్లో రూ.600 కోట్లు సాధించింది.
ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండు వారలు పూర్తి చేసుకున్నా కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపుతూనే ఉంది. గత కొంత కాలంగా బాలీవుడ్ లో బాయ్‌కాట్ ట్రెండ్ వల్ల స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు పఠాన్ సినిమాతో బాలీవుడ్ కొంత ఊపిరి పీల్చుకుంటుంది. రెండో వీకెండ్ లో కూడా ఈ చిత్రం హిందీ బెల్ట్ లో దాదాపు రూ.63.5 కోట్ల రాబట్టి అందర్నీ ఆశర్య పరిచింది. నాన్ వీకెండ్ సోమవారం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద 8.25 కోట్లు రాబట్టి షారుఖ్ సత్తా ఏంటో చూపిస్తుంది.
ఇక తెలుగు, తమిళంలో కూడా కలెక్షన్స్ నిలకడగా సాగుతున్నాయి. రెండో వీకెండ్ లో రూ.15.70 కోట్లు రాబట్టింది. అన్ని భాషల్లో కలుపుకొని ఈ సినిమా ఇప్పటివరకు రూ.438.45 కోట్ల నెట్ షేర్ సాధించింది. దీంతో ఈ సినిమా హిందీ బెల్ట్ లో కేజీఎఫ్-2 లైఫ్ టైం కలెక్షన్స్ ని బ్రేక్ చేయడానికి చాలా దగ్గరిలో ఉంది. ఈ వారం కూడా ఇదే రేంజ్ లో కలెక్షన్స్ రాబడితే 1000 కోట్లు సాధించడం పక్కా అంటున్నారు సినిమా పండితులు. ఏదేమైనా ఈ సినిమా విజయంతో బాలీవుడ్ కి పూర్వ వైభవం వచ్చింది అనే చెప్పాలి.
#Pathaan is SUPER-STRONG on [second] Mon [weekday rates], especially after collecting a HUMONGOUS TOTAL till Weekend 2… Inches closer to #KGF2 #Hindi *lifetime biz*… [Week 2] Fri 13.50 cr, Sat 22.50 cr, Sun 27.50 cr, Mon 8.25 cr. Total: ₹ 422.75 cr. #Hindi. #India biz. pic.twitter.com/M9UinfXkLp
— taran adarsh (@taran_adarsh) February 7, 2023
