Pathaan Collections : ఆ రికార్డ్ దాటిన పఠాన్.. అయినా బిగ్గెస్ట్ రికార్డ్ మన బాహుబలిదే.. పఠాన్ @ 850 కోట్లు..

పఠాన్ సినిమా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజయింది. అయిదు రోజుల్లోనే 550 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన పఠాన్ ఆ తర్వాత కలెక్షన్స్ ని మెల్లిగా వసూలు చేసుకుంటూ వస్తుంది. ఇప్పటికే 12 రోజుల్లో గత ఆదివారం వరకు పఠాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 850 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని................

Pathaan Collections : ఆ రికార్డ్ దాటిన పఠాన్.. అయినా బిగ్గెస్ట్ రికార్డ్ మన బాహుబలిదే.. పఠాన్ @ 850 కోట్లు..

Pathaan Collected 850 crores gross collections in 12 days

Pathaan Collections :  షారుఖ్, దీపికా జంటగా, జాన్ అబ్రహం విలన్ గా, సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ సినిమా మంచి విజయం సాధించి కలెక్షన్స్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ రోజు నుంచి హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్స్ ని భారీగా వసూలు చేస్తుంది. ఈ సినిమాతో చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత షారుఖ్ హిట్ కొట్టడమే కాకుండా గత సంవత్సర కాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న బాలీవుడ్ కి పెద్ద విజయాన్ని అందించాడు. ఇప్పటికే పఠాన్ సినిమా కలెక్షన్స్ తో అనేక రికార్డులని సాధించింది.

పఠాన్ సినిమా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజయింది. అయిదు రోజుల్లోనే 550 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన పఠాన్ ఆ తర్వాత కలెక్షన్స్ ని మెల్లిగా వసూలు చేసుకుంటూ వస్తుంది. ఇప్పటికే 12 రోజుల్లో గత ఆదివారం వరకు పఠాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 850 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. అంటే దాదాపు 420 కోట్లకి పైగా షేర్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. దీంతో మరిన్ని రికార్డులు సెట్ చేసింది పఠాన్.

Jackie Shroff : జైలర్‌లో మరో బాలీవుడ్ నటుడు.. స్టార్స్ తో నిడిపోతున్న జైలర్..

ఇప్పటికే పఠాన్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన సినిమా దంగల్ ని దాటించింది. అలాగే అత్యంత వేగంగా 400 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసిన హిందీ సినిమాగా నిలిచింది. ఈ లిస్ట్ లో బాహుబలి 2 హిందీ సినిమా 15 రోజుల్లో 400 కోట్లు కలెక్ట్ చేయగా KGF 2 హిందీ వెర్షన్ 23 రోజులకు 400 కోట్లు కలెక్ట్ చేసింది. కానీ పఠాన్ సినిమా 12 రోజుల్లోనే ఈ రికార్డు సాధించింది. ఇందులో బాహుబలి దాటినా బాహుబలి హిందీ వర్షన్ మొత్తం 520 కోట్ల షేర్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. దీంతో ఆ రికార్డుని టార్గెట్ గా పెట్టుకుంది ఇప్పుడు పఠాన్. ఇక ఇప్పటికే 850 కోట్ల కలెక్షన్స్ సాధించిన పఠాన్ 1000 కోట్లు టార్గెట్ పెట్టుకుంది. మరి ఆ టార్గెట్ ఎప్పటికి రీచ్ అవుతుందో చూడాలి.