Pawan Kalyan : అభిమానులందు పవన్ అభిమానులు వేరయా.. 470 కేజీల వెండితో..
అభిమానులందు పవన్ కళ్యాణ్ అభిమానులు వేరయా అని ఊరుకునే అంటారా..? తాజాగా పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్ చేసిన ఒక పని..
- gum 95921
- Published on- September 1, 2023 / 11:14 AM IST
Pawan Kalyan 470kg Silver Art created by his fans gone viral
Pawan Kalyan : అభిమానులందు పవన్ కళ్యాణ్ అభిమానులు వేరయా అని ఊరుకునే అంటారా..? పవన్ పై వాళ్ళు చూపించేది అభిమానం అనడం కంటే భక్తి అనడం కరెక్ట్ ఉంటుంది. ఇండస్ట్రీలోని చాలా మంది వ్యక్తులు ఈ మాటని అంగీకరిస్తారు. అభిమానంతో పవన్ పై వాళ్ళు చూపించే ప్రేమకి పవన్ మాత్రమే కాదు ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతుంటారు. తాజాగా పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్ చేసిన పని చూస్తే మీకు కూడా గూస్బంప్స్ వస్తాయి. దాదాపు 470 కేజీల వెండితో పవన్ రూపాన్ని రూపొందించి అదరహో అనిపించారు.
సెప్టెంబర్ 2 పవన్ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ బర్త్ డేకి తమ అభిమాన హీరోకు ఒక అరుదైన బహుమతి ఇవ్వాలని కొంతమంది అభిమానులు భావించారు. ఈక్రమంలోనే 470 కేజీల వెండి ఆభరణాలతో.. నెల పై పవన్ రూపాన్ని రూపొందిస్తూ అమర్చి వావ్ అనిపించారు. ఇక ఈ మొత్తం ఆర్ట్ ని ఒక వీడియోగా చిత్రీకరించగా, దానిని జనసేన పార్టీ లీడర్ నాదెండ్ల మనోహర్ చేత రిలీజ్ చేయించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ వీడియోని ఒకసారి మీరుకూడా చూసేయండి.
Varun Tej : నిర్మాతల కోసం వరుణ్ తేజ్ గొప్ప నిర్ణయం.. గ్రేట్ అంటున్న అభిమానులు..
ఇక ఈ వీడియో చూసిన కొంతమంది.. ఆ మొత్తం సిల్వర్ ధర ఎంతనేది కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రేటు ప్రకారం ఆ 470 కేజీల వెండి ధర సుమారు రూ.3,71,30,000 (3కోట్ల 71లక్షల 30వేలు) అంటూ చెప్పుకొస్తున్నారు. మరి బర్త్ డే కానుకగా అభిమానుల నుంచి పవన్ ఇంక ఎలాంటి బహుమతులు వస్తాయో చూడాలి. కాగా పవన్ సినిమాల నుంచి అభిమానులకు గిఫ్ట్ ఇవ్వడానికి నిర్మాతలు కూడా ప్లాన్ చేశారు. OG మూవీ టీజర్ ని రేపు సెప్టెంబర్ 2 మార్నింగ్ 10:35 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
