PM Modi-Pawan Kalyan Family: మొదటిసారి తన నలుగురు పిల్లలతో పవన్ కళ్యాణ్.. పీఎం మోదీతో స్పెషల్ గ్రూప్ ఫోటో వైరల్..

PM Modi-Pawan Kalyan Family: ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని పరామర్శించడానికి పీఎం మోదీ స్వయంగా పవన్ ఇంటికి వెళ్లారు. (Pawan Kalyan)

  • Updated on- May 11, 2026 / 10:44 AM IST

Pawan Kalyan Four Children Photo with PM Narendra Modi

PM Modi-Pawan Kalyan: పీఎం మోదీ ఆదివారం నాడు హైదరాబాద్ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ని కూడా కలిశారు. సైనస్ కి సంబంధించిన శస్త్ర చికిత్స తీసుకొని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొన్నాళ్లుగా ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని పరామర్శించడానికి పీఎం మోదీ స్వయంగా పవన్ ఇంటికి వెళ్లారు.

దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ పీఎం మోదీతో దిగిన పలు ఫోటోలను జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా పేజీలలోను, పవన్ భార్య అన్నా లెజినోవా సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసారు. ఈ ఫొటోల్లో ఓ గ్రూప్ ఫోటో మాత్రం ఇప్పుడు వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవా, తన నలుగురు పిల్లలతో కలిసి పీఎం మోదీతో స్పెషల్ గ్రూప్ ఫోటో దిగారు.

ఈ ఫొటోలో పీఎం నరేంద్రమోదీతో పవన్ కళ్యాణ్, పవన్ భార్య అన్నా లెజినోవాతో పాటు పవన్ నలుగురు పిల్లలు అకిరా నందన్, ఆద్య, పవన్ రెండో కూతురు పలీనా అంజని, పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్ లు ఈ ఫొటోలో ఉన్నారు. పవన్ తన నలుగురు పిల్లలతో కలిసి ఒకేసారి కనిపించడం ఇదే మొదటిసారి. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.

గతంలో పవన్ తన పిల్లలతో కలిసి కనిపించినా ఎప్పుడూ ఒకేసారి నలుగురితో కనపడలేదు. ఇందులో అకిరా నందన్, ఆద్య రేణు దేశాయ్ సంతానం కాగా పలీనా అంజని, మార్క్ శంకర్ లు అన్నా లెజినోవా సంతానం. ఇలా పవన్ నలుగురు పిల్లలతో మొదటిసారి కనిపించడం అది కూడా మోదీతో గ్రూప్ ఫోటో కావడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.

Also See : Siva Jyothi: మదర్స్ డే రోజున కూతురు ‘వెన్నెల’తో.. క్యూట్ ఫోటోలు షేర్ చేసిన శివ జ్యోతి