Pawan Kalyan : 2028 సంక్రాంతి ఫిక్స్..? అనిల్ రావిపూడి – పవన్ కళ్యాణ్.. హింట్ ఇచ్చిన దిల్ రాజు.. ఫ్యాన్స్ కి పండగే..

2028 సంక్రాంతికి కూడా అనిల్ రావిపూడి సినిమా ఫిక్స్ అయిపోయిందట. (Pawan Kalyan)

  • Published on- November 13, 2026 / 05:39 PM IST

Pawan Kalyan

Pawan Kalyan : అనిల్ రావిపూడి సినిమా అంటే పండక్కి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో వచ్చి హిట్ కొట్టాల్సిందే. అందుకే ప్రతి సంక్రాంతికి తన సినిమా ప్లాన్ చేసుకొని స్టార్ హీరోలతో ఫాస్ట్ గా సినిమా చేసి హిట్ కొట్టి లాభాలు తెప్పించి నిర్మాతలకు ఫేవరేట్ దర్శకుడు అయ్యాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి జనవరి 12 విడుదల సినిమా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ తో చేస్తున్నాడు. ఈ సినిమా 2027 సంక్రాంతికి రిలీజ్ అవ్వనుంది.

ఇప్పుడు 2028 సంక్రాంతికి కూడా అనిల్ రావిపూడి సినిమా ఫిక్స్ అయిపోయిందట. దిల్ రాజు దీనిపై ఇన్ డైరెక్ట్ గా మాట్లాడారు. గత కొన్ని రోజులుగా దిల్ రాజు నిర్మాణంలో పవన్ కళ్యాణ్ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. నిన్నే దిల్ రాజు వెళ్లి పవన్ కళ్యాణ్ ని కలిశారు. నేడు రామాయణ డిస్ట్రిబ్యూషన్ సక్సెస్ మీట్ నిర్వహించగా ఈ ఈవెంట్లో దిల్ రాజు ఈ సినిమాపై మాట్లాడారు.

Also Read : Dil Raju : ‘టాక్సిక్’ ఫలితంపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు.. నాపై పెయిడ్ ప్రమోషన్స్.. నేను అన్ని గమనిస్తాను..

దిల్ రాజు అనిల్ రావిపూడి సినిమా గురించి మాట్లాడుతూ.. అవును అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా మా బ్యానర్ లోనే. 2027 లో మొదలుపెట్టి 2028 సంక్రాంతికి రిలీజ్ చేస్తాము. ఇంకా మేమిద్దరం కూర్చొని మాట్లాడుకోలేదు. ఒక లైన్ అయితే ఉంది. ప్రస్తుతం అనిల్ జనవరి 12 విడుదల సినిమాలో బిజీగా ఉన్నాడు. అది రిలీజ్ అయ్యాక మాట్లాడుకొని మొదలుపెడతాం. హీరో,కంటెంట్ ఎవరు ఏంటి అనేది ఇంకా ఫైనల్ అవ్వలేదు అన్నారు.

అలాగే పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి మాట్లాడుతూ.. నిన్న పవన్ కళ్యాణ్ గారిని కలిసాము. ఆయనతో ఇంకో సినిమా తీద్దామని మాట్లాడాను. నిన్న మా ఇద్దరి ఫోటో చూసారుగా సంతోషంగా ఉన్నాయి ఫేస్ లు దాని బట్టి మీరే అర్ధం చేసుకోండి. ఆయనతో సినిమా ఉంటుంది. వకీల్ సాబ్ తర్వాత నిర్మాతగా ఇంకో అద్భుతమైన సినిమా ఆయనకు ఇవ్వాలని అనుకున్నాను. దాని కోసమే అడుగులు వేస్తున్నాను. అది ఎలా ఏంటి అనేది ప్రాపర్ గా రెడీ అయినప్పుడు అధికారికంగా నేనే ప్రకటిస్తాను అన్నారు.

Also Read : Scene : వామ్మో.. అన్ని కోట్లకు ఓటీటీకి అమ్ముడయిన సూర్య ‘సీన్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

అనిల్ రావిపూడి, పవన్ కళ్యాణ్ సినిమాపై ఇన్ డైరెక్ట్ గా స్పందించి వాళ్ళ నెక్స్ట్ సినిమాలు దిల్ రాజుతోనే అన్నట్టు తెలిపారు. గతంలో పవన్ కళ్యాణ్ తో అనిల్ రావిపూడి సినిమా అని వార్తలు వచ్చాయి. పవన్ కూడా ఇప్పుడు రాజకీయాల దృష్ట్యా ఎవరు తక్కువ డేట్స్ లో సినిమా తీస్తే వాళ్ళకే డేట్స్ ఇస్తున్నారు. దీంతో అనిల్ రావిపూడి – పవన్ కళ్యాణ్ కాంబో సెట్ అని, పవన్ కళ్యాణ్ కి మరో హిట్ అనిల్ తో ఇప్పిస్తారని, అనిల్ కూడా చాలా తక్కువ రోజుల్లో షూట్ పూర్తి చేసేస్తాడు కాబట్టి ఈ ఇద్దరి సినిమానే ఉంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. అయితే అధికారికంగా దిల్ రాజు చెప్పేదాకా ఎదురుచూడాల్సిందే. ఒకవేళ ఈ కాంబో వస్తే 2028 సంక్రాంతి పవన్ ఫ్యాన్స్ కి పండగే. ఇంకో హిట్టు సినిమా లోడింగ్.