Pawan Kalyan – Anushka Shetty : పవన్, అనుష్క కాంబోలో సినిమా మిస్ అయిందని తెలుసా? ఏ సినిమా అంటే..

స్టార్ హీరోయిన్ అనుష్కతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా మిస్ అయిందని తెలుసా?

Pawan Kalyan Anushka Shetty Combo Missed in a Movie

Pawan Kalyan – Anushka Shetty : పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చేతిలో ఉన్న రెండు సినిమాలు పూర్తిచేశాక మళ్ళీ సినిమాలు చేసే ఆలోచన లేదు. పవన్ తన కెరీర్ లో చాలా మంది స్టార్ హీరోయిన్స్ తో పనిచేసారు. అయితే స్టార్ హీరోయిన్ అనుష్కతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా మిస్ అయిందని తెలుసా?

కమర్షియల్ హీరోయిన్ గా మొదలుపెట్టిన అనుష్క అరుంధతితో స్టార్ అయిపోయింది. ఇక బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ అయింది కానీ ఆ తర్వాత సినిమాలు తగ్గించేసి అడపాదడపా చేస్తుంది.

Also Read : Ananya nagalla : ఉఫ్.. చీరలో అనన్య నాగళ్ళ ఇంత హాట్ గా.. ఫొటోలు వైరల్..

అనుష్క – పవన్ కళ్యాణ్ కలిసి బంగారం సినిమాలో చేయాలంట. కానీ చివరి నిమిషంలో హీరోయిన్ ని మార్చారు. ధరణి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమా 2006లో రిలీజయి యావరేజ్ గా నిలిచింది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి హీరోయిన్ ఉండదు. మీరా చోప్రా, రీమా సేన్ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా పవన్ కి పెయిర్ కాదు. సినిమా చివర్లో త్రిష గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి పవన్ కి పెయిర్ లా కనిపిస్తుంది. త్రిష పాత్రకి మొదట అనుష్కని అనుకున్నారు. అనుష్క అప్పుడే 2005 లోనే ఎంట్రీ ఇచ్చింది. అప్పటికి అనుష్క ఇంకా ఎవరికీ తెలీదు. దాంతో కొంచెం అందరికి తెలిసిన హీరోయిన్ అయితే బాగుంటుంది అని తర్వాత త్రిషని ఫైనల్ చేసారు. అలా అనుష్క – పవన్ కాంబోలో సినిమా మిస్ అయింది.