Purusha: సమ్మర్ కానుకగా వస్తున్న ‘పురుష:’.. రిలీజ్ డేట్ లాక్
విడుదలకు సిద్దమైన పవన్ కళ్యాణ్ బత్తుల పురుష(Purusha) మూవీ.
- V Santhosh Kumar
- Published on- May 7, 2026 / 07:16 PM IST
Pawan Kalyan Bathula Purusha movie is ready for release.
Purusha: కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న ‘పురుష(Purusha):’ చిత్రంతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. వీరు వులవల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్లు ప్రేక్షకులలో మంచి క్యూరియాసిటీని పెంచాయి. ముఖ్యంగా సప్తగిరి, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ కమెడియన్ల కలయికతో ఈ చిత్రం పూర్తిస్థాయి వినోదాత్మకంగా సాగనుందని అర్థమవుతోంది.
Shivani Nagaram: చీరకట్టులో ‘లిటిల్ హార్ట్స్’ బ్యూటీ.. శివాని నగరం గ్లామర్‌కు ఫ్యాన్స్ ఫిదా
తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ఖరారు చేసింది. మే 22న సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. వేసవి సెలవుల్లో కుటుంబం మొత్తం కలిసి హాయిగా నవ్వుకునేలా ఈ కథను తీర్చిదిద్దినట్లు మేకర్స్ తెలిపారు. రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టి, సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు టీమ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
సాంకేతికంగా ఈ సినిమా కోసం ప్రతిభావంతులైన బృందం పనిచేస్తోంది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తుండగా, సతీష్ ముత్యాల కెమెరా బాధ్యతలు నిర్వహించారు. రాజీవ్ కనకాల, వి.టి.వి. గణేష్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా, యువ హీరో పవన్ కళ్యాణ్‌కు తెలుగు చిత్రసీమలో మంచి ఆరంభాన్ని ఇస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
