×
Ad

Bro Movie : బ్రో స్పెషల్ షోస్, టికెట్స్ రేట్ పెంపు లేదు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. పవన్ వస్తున్నాడా..?

బ్రో మూవీ స్పెషల్ షోస్, టికెట్స్ రేట్ పెంపు పై చిత్ర నిర్మాత కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి కూడా మాట్లాడారు.

  • Published On : July 19, 2023 / 03:24 PM IST

Pawan Kalyan Bro Movie had no special shows and ticket price hikes

Bro Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘బ్రో’. తమిళంలో హిట్ అయిన వినోదయ సిత్తంకి ఇది రీమేక్ గా వస్తుంది. తమిళ్ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన సముద్రఖని.. ఈ రీమేక్ ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ నెల 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం పవన్ తప్ప చిత్ర యూనిట్ అంతా ప్రమోషన్స్ లో ఉన్నారు.

Guntur Karam : గుంటూరు కారం సెట్స్ నుంచి ఫోటో లీక్.. పొలిటికల్ టచ్‌తో మూవీ..!

ఈ క్రమంలోనే నిర్మాత టి జి విశ్వ ప్రసాద్ కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో సినిమా స్పెషల్ షోస్ అండ్ సినిమా టికెట్స్ రేట్ పెంపు పై కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాని లిమిటెడ్ బడ్జెట్ లోనే పూర్తి చేసినట్లు, కాబట్టి టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం లేదని, అలాగే స్పెషల్ షోస్ కోసం కూడా రెండు గవర్నమెంట్స్ కి ఏ రిక్వెస్ట్ పెట్టలేదని తెలియజేశారు. ఇక స్పెషల్ షోలు లేవని తెలియడంతో పవన్ అభిమానులు కొంత నిరాశ చెందుతున్నారు.

Lavanya Niharika : వదిన మరదళ్ల స్పెషల్ సెల్ఫీలు.. పార్టీలో ఎంజాయ్ చేస్తున్న లావణ్య, నిహారిక..

ఇక ఇదే ఇంటర్వ్యూలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి కూడా నిర్మాత మాట్లాడారు. ఈ నెల 25న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో ఈ ఈవెంట్ జరగబోతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ దాదాపు అటెండ్ అవ్వవచ్చు అని తెలియజేశారు. ఒకవేళ పవన్ కి ఆ రోజు ఎటువంటి రాజకీయ పనులు లేకపోతే కచ్చితంగా వస్తాడని అర్ధమవుతుంది. మరి పవన్ వస్తాడా లేదా చూడాలి. అలాగే ఈ మూవీ ట్రైలర్ ని కూడా ఆ రోజే రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.