BRO Movie : పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏ రేంజ్ హైప్ ఉండాలి.. కానీ ‘బ్రో’ సినిమాని ఫ్యాన్స్ కూడా పట్టించుకోవట్లేదు..

బ్రో సినిమా జులై 28న రిలీజ్ కి రెడీ అవుతోంది. సినిమాని ఎంత స్పీడ్ గా స్టార్ట్ చేశారో అంతే స్పీడ్ గా కంప్లీట్ చేసేశారు కానీ ప్రమోషన్ల విషయంలో మాత్రం కాస్త స్లో అవుతున్నారన్న టాక్ నడుస్తోంది.

Pawan Kalyan busy with Political tours no buzz on Bro Movie Fans Disappointed

Pawan Kalyan BRO Movie :  పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ సినిమా అంటే హడావిడి ఏ రేంజ్ లో ఉండాలి? ఇంత భారీ మల్టీస్టారర్ అంటే సందడి ఏ రేంజ్ లో చెయ్యాలి? కానీ అదేం అంతగా కనిపించడం లేదు. మేకర్స్ మాత్రం ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నా ఫ్యాన్స్ మాత్రం లైట్ తీసుకుంటున్నారు. జనరల్ గా పవన్ కళ్యాణ్ సినిమా అంటే తెగ హంగామా చేసే ఫాన్స్ ‘బ్రో’ని లైట్ తీసుకుంటున్నారు.

బ్రో సినిమా జులై 28న రిలీజ్ కి రెడీ అవుతోంది. సినిమాని ఎంత స్పీడ్ గా స్టార్ట్ చేశారో అంతే స్పీడ్ గా కంప్లీట్ చేసేశారు కానీ ప్రమోషన్ల విషయంలో మాత్రం కాస్త స్లో అవుతున్నారన్న టాక్ నడుస్తోంది. రిలీజ్ కి ఇంకా 15రోజుల టైమ్ కూడా లేదు కానీ సినిమా ఏ మాత్రం బజ్ క్రియేట్ చెయ్యలేకపోతోంది. జనరల్ గా పవన్ సినిమా అంటే ఉండే హైప్, సందడి ‘బ్రో’కి మాత్రం లేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

సినిమా ఎంత బావున్నా, ఎంత హైప్ ఉన్నా ప్రమోషన్లు లేనిదే సినిమా ఆడియన్స్ లోకి వెళ్లడం కష్టం. అందుకే సినిమా స్టార్ట్ చేసిన దగ్గరనుంచి ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేస్తూనే ఉంది టీమ్. కానీ సినిమా మీద పెద్దగా బజ్ మాత్రం క్రియేట్ అవ్వడం లేదు. కారణం అటు పవన్ తో పాటు ఫ్యాన్స్ కూడా సినిమాని లైట్ తీసుకోవడమే అన్న టాక్ నడుస్తోంది. పవన్ ఎక్కడుంటే ఫ్యాన్స్ కాన్సన్ట్రేషన్ అక్కడే ఉంటుంది. పవన్ వారాహి యాత్రలో బిజీగా ఉండడంతో అభిమానులు కూడా అటు వైపే చూస్తున్నారు కానీ ‘బ్రో’ని పెద్దగా పట్టించుకోవడం లేదన్న టాక్ వినిపిస్తోంది. అలాగే ఇది కూడా రీమేక్ సినిమా కావడం, ఇప్పటికే సినిమాని చాలా మంది ఓటీటీలో చూడటంతో కూడా సినిమాని పెద్దగా పట్టించుకోవట్లేదు.

పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ కి చాలా తక్కువ వస్తారు. అసలు బ్రో సినిమాకి రాజకీయాలతో బిజీగా ఉండి పూర్తిగా సినిమా ప్రమోషన్లకి దూరంగా ఉండడంతో సినిమా మీద పెద్దగా బజ్ క్రియేట్ కావడం లేదు. సాయిధరమ్ ఒక్కడే ప్రమోషన్లు చెయ్యడంతో జనాల్లోకి పెద్దగా సినిమా వెళ్లడం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం, దానికి పవన్ కళ్యాణ్ రావడం కూడా కష్టమేనేమో అని కూడా టాక్ వినిపిస్తుంది. పవన్ తన రాజకీయ యాత్రలతో అసలు బ్రో సినిమాని పట్టించుకోకపోవడం, ఆ సినిమాలో ఫ్యాన్స్ కి కిక్కిచ్చే అంశాలేం లేకపోవడంతో పవన్ సినిమాకి ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ‘బ్రో’కి జరగడం లేదు.

Pawan Kalyan : నా సంపాదన రోజుకి 2 కోట్లు.. వదులుకుని మీ భవిష్యత్ కోసం వచ్చాను.. వారాహి విజయ యాత్రలో పవన్ వ్యాఖ్యలు

అందుకే పవన్ ని ఒక్కసారైనా బ్రో ప్రమోషన్స్ కి రప్పించి సినిమాకి బజ్ క్రియేట్ చెయ్యాలని చూస్తున్నారు చిత్రయూనిట్. ఈ నెల 19 వరకూ పవన్ వారాహి షెడ్యూల్ బిజీ గా ఉంది. మరి ఈ యాత్ర షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాతైనా పవన్ ఒక్కసారైనా బ్రో కోసం వస్తే ఫ్యాన్స్ ఆటోమేటిక్ గా బ్రో వైపు చూస్తారు. అందుకే బజ్ రావాలంటే పవన్ రావాలని ఎదురుచూస్తున్నారు అందరూ. లేకపోతే బ్రో కలెక్షన్ల మీద దెబ్బ పడటం ఖాయం అంటున్నారు ట్రేడ్ వర్గాలు.