పవన్ పేరిట ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్…

  • Publish Date - August 17, 2020 / 11:33 AM IST

రికార్డులు ఉన్నది వేరొకరు బద్దలు కొట్టడానికే అని ఇటీవల ఓ ఫంక్షన్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అన్న విషయం తెలిసిందే. అన్నట్లే.. తాజాగా మహేష్ బాబు బర్త్‌డే రోజు నమోదైన ప్రపంచ రికార్డ్‌ను పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ బద్దలు కొట్టేశారు. తమ హీరో పేరిట ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్‌ను క్రియేట్ చేశారు. అసలు విషయంలోకి వస్తే.. ఇప్పుడు హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ‘ట్రెండింగ్’ అనే పోటీ జరుగుతున్న విషయం తెలిసిందే.



ఇన్ని గంటలలో ఇంత మంది ట్వీట్ చేశారు. ఇంత మంది ఈ ట్రెండ్ కోసం పాల్గొన్నారు అనేవి ఇప్పుడు రికార్డ్‌లు. ఈ ఫైట్ ముఖ్యంగా పవన్, మహేష్, ప్రభాస్, రామ్ చరణ్‌, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి వారి కోసం వారి అభిమానులు చేస్తుంటారు.





ఇక మహేష్ బాబు బర్త్‌డేని పురస్కరించుకుని అభిమానులు ఆయన బర్త్‌డే ట్యాగ్‌ను 24 గంటల్లో 60.2 మిలియన్ ట్వీట్స్‌తో ప్రపంచ రికార్డ్ నమోదు చేస్తే.. పవన్ కల్యాణ్ కామన్ బర్త్‌డే సీడీపీతో ఆయన అభిమానులు 24 గంటల్లో 65 మిలియన్ల ట్వీట్స్ చేసి ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్‌ను నమోదు చేశారు.



మరి సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు.. ఇంకా ఆయన బర్త్‌డే రానే లేదు.. అప్పుడే వరల్డ్ రికార్డ్ నమోదైంది. మరి బర్త్‌డే రోజు భీభత్సం ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాల్సి ఉంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా ‘వకీల్ సాబ్’ చిత్రానికి సంబంధించి అప్‌డేట్ రానుందని సమాచారం.