Pawan Kalyan : మెగా వారసురాలి పై పవన్ ట్వీట్
మెగా ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. చిరంజీవి(Chiranjeevi) కుటుంబంలో మూడో తరం అడుగిడింది. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్(Charan)- ఉపాసన(Upasana) దంపతులు తల్లిదండ్రులు అయ్యారు.
- Thota Vamshi Kumar
- Updated on- June 30, 2023 / 04:18 PM IST
Pawan Kalyan Wishes
Pawan Kalyan Wishes to Charan : మెగా ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. చిరంజీవి(Chiranjeevi) కుటుంబంలో మూడో తరం అడుగిడింది. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్(Charan)- ఉపాసన(Upasana) దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. మంగళవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వారసురాలి రాకతో మెగా కుటుంబం ఆనందంతో మునిగిపోయింది.
ప్రిన్సెస్ రాకని సోషల్ మీడియా వేదికగా చిరంజీవి (Chiranjeevi) తెలియజేశారు. “వెల్కమ్ లిటిల్ మెగా ప్రిన్సెస్. కోట్లాది మంది మెగా ఫ్యామిలీలో నువ్వు ఎంతో ఆనందాన్ని వెదజల్లావు. అలాగే నే తల్లిదండ్రలు రామ్ చరణ్ – ఉపాసన, మరియు నీ గ్రాండ్ పేరెంట్స్ లో కూడా ఎంతో సంతోషాన్ని నింపావు” అంటూ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో రామ్‌చరణ్-ఉపాసన దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు, చరణ్ కు బాబాయి అయిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషెస్ చెప్పారు. ‘రామ్‌చరన్- ఉపాసన దంపతులకు ఆడబిడ్డ జన్మించిన తరుణాన ప్రేమపూర్వక శుభాకాంక్షలు.. శుభాశీస్సులు..’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
Chiranjeevi : స్నేహితుడు కొడుకుని ఇంట్రడ్యూస్ చేయబోతున్న చిరంజీవి.. మా అబ్బాయి భాద్యత చిరంజీవిదే!
Chiranjeevi : మెగా వారసురాలికి ఎవరి పోలికలు వచ్చాయి.. మెగాస్టార్ ఏమి చెప్పారు..
రామ్‌చరణ్-ఉపాసన లు 2012లో వివాహం చేసుకున్నారు. పెళ్లైన 10 ఏళ్ల తరువాత వీరు తల్లిదండ్రులు అయ్యారు. గతేడాది డిసెంబర్ 12న ఇరు కుటుంబాలు వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక బిడ్డ పుట్టిన తరువాత తాము చిరంజీవి ఇంటికి షిఫ్ట్ అవుతామని ఉపాసన ఇప్పటికే చెప్పింది. గ్రాండ్ పేరెంట్స్ అయిన చిరంజీవి, సురేఖల సంరక్షణలో తమ చిన్నారి పెరగాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొంది.
