Pawan Kalyan Doing Martial Arts After 2 Decades
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో పవన్ తన లుక్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. పీరియాడికల్ ఫిక్షన్ కథతో ఈ సినిమా వస్తుండటంతో పవన్ ఈ సినిమాతో ఎలాంటి కొత్త రికార్డులు సృష్టిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇదిలా ఉండగా, పవన్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ ఫోటో పోస్ట్ చేయడంతో అది ప్రస్తుతం తుఫాను క్రియేట్ చేస్తోంది. దాదాపు 2 దశాబ్దాల తరువాత పవన్ ఇలా చేయడం చూసిన అభిమానులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పవన్ తాజాగా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. గతంలో జానీ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ చేస్తూ కనిపించిన పవన్, తిరిగి ఇన్నాళ్లకు ఇలా ప్రాక్టీస్ చేస్తూ కనిపించడంతో అభిమానులు ఈ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు.
Pawan Kalyan : #WeDontWantTheriRemake.. ఇంకా ట్రెండ్ చేస్తున్న పవన్ అభిమానులు..
అయితే పవన్ ఇన్నాళ్లకు మళ్లీ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నది హరిహర వీరమల్లు కోసమేనా అనే సందేహం వారిలో నెలకొంది. ఏదేమైనా తమ అభిమాన హీరో మరోసారి తన ఫైట్స్‌తో ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
After two decades I got into my Martial Arts practice. pic.twitter.com/3CLqGRNbvH
— Pawan Kalyan (@PawanKalyan) December 9, 2022