Pawan Kalyan : తేజ్‌కి యాక్సిడెంట్ అయిన సమయంలో ఒక మూలన కూర్చుని ఏడ్చా..

బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తేజ్‌కి యాక్సిడెంట్ అయిన సమయంలో హాస్పిటల్ వాడి పరిస్థితి చూసి ఒక మూలన కూర్చుని ఏడుస్తూ..

Pawan Kalyan emotional about Sai Dharam Tej accident at bro event

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీని సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మెగా మల్టీస్టారర్ చిత్రం ఈ నెల 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్ప కళా వేదికలో జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి మెగా వారసులు వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Pawan Kalyan : మా వదిన నాకు చాలా ద్రోహం చేసింది.. దాని వల్ల ఇప్పుడు ఇలా ఉన్నాను..

ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..

ఈ సినిమా కథకి సాయి ధరమ్ తేజ్ రియల్ లైఫ్ కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ మూవీ ఓకే చేసే సమయంలోనే తనకి యాక్సిడెంట్ అయ్యింది. త్రివిక్రమ్ ఇంటిలో ఉండగా నాకు ఫోన్ వచ్చింది. వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాను. చిన్న యాక్సిడెంటే అనుకున్నాను. ఇంకో గంటలో బయటకి వచ్చేస్తాడు అని అనుకున్నాను. కానీ బయటకి రావడం లేదు. నాకు తెలియని ఒక నిస్సహాయత వచ్చేసింది. పెద్ద పెద్ద డాక్టర్స్ వస్తున్నారు, చూస్తున్నారు.. కానీ ఏమి చెప్పలేకపోతున్నారు. నాకు చాలా భయం వేసింది.

Varun Tej : సినిమా అయినా, రాజకీయం అయినా బాబాయ్ వెనుకే మా కుటుంబమంతా..

సినిమాల్లో మాదిరి గుళ్ళకి వెళ్లి పూజలు, వ్రతాలు చేయలేము. దీంతో తెలియని నిస్సహాయత ఒక మూలన కూర్చుని మనసులో ఏడ్చాను. వాడికి ఇంకా జీవితం ఉంది వాడిని కాపాడు అని నేను పూజించే దేవతని కోరుకున్నాను. తనని కాపాడిన డాక్టర్స్‌కి, అంతకంటే ముందు రోడ్డు మీద పడి ఉన్న తనని వెంటనే హాస్పిటల్ కి తరలించిన అబ్దుల్ పర్హాన్ కి ఎప్పటికి రుణపడి ఉంటాను. ఈ సినిమా సమయంలో కూడా తేజ్ మాటల రాక చాలా కష్టపడ్డాడు. అయితే దర్శకుడు సముద్రఖని తనని జాగ్రత్తగా చూసుకొని తనతో డైలాగ్స్ చెప్పించారు.