OG Craze: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. క్రాకర్స్ పేలుస్తూ ఓ రేంజ్ లో సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ఓజీ క్రేజ్ తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. థియేటర్ల దగ్గర భారీగా పవన్ ఫ్యాన్స్ చేరుకున్నారు. పవన్, ఓజీ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. పవన్, ఓజీ మూవీ కటౌట్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు అభిమానులు.
రేట్ల సంగతి పక్కన పెడితే.. తమ అభిమాన నటుడి సినిమా కోసం ఎంతైనా ఖర్చు చేస్తామంటున్నారు ఫ్యాన్స్. పవన్ కల్యాణ్ కెరీర్ లో ఇలాంటి సినిమా తీయలేదని అభిమానులు అంటున్నారు. ఈ మూవీలో ఇచ్చినట్లుగా ఏ మూవీలోనూ పవన్ కు ఎలివేషన్ ఇవ్వలేదంటున్నారు. ఇలాంటి ఫైటింగ్స్ కూడా చూడలేదన్నారు. పవన్ కల్యాణ్ ని ఎలా చూపించాలో అలా చూపించారని అభిమానులు ఖుషీ అవుతున్నారు. మీసం మెలేసి చెబుతున్నాం ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని ధీమాగా చెబుతున్నారు.
అటు ఓజీ సినిమా ప్రీమియర్లు స్టార్ట్ అయిపోయాయి. హీరో టైటిల్ కార్డ్, ఎంట్రీ అదిరిపోయాయని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పవన్ లుక్, ఎలివేషన్లు, ఫైట్ సీన్లు, తమన్ బీజీఎం ఆకట్టుకుంటున్నాయని చెబుతున్నారు.