Pawan Kalyan – Nidhhi Agerwal : పవన్ ‘హరిహర వీరమల్లు’ అప్డేట్.. హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్..

తాజాగా నేడు నిధి అగర్వాల్ పుట్టిన రోజు కావడంతో ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

Pawan Kalyan HariHara VeeraMallu Movie Nidhhi Agerwal First Look Poster Released

Pawan Kalyan – Nidhhi Agerwal : పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో చేతిలో ఉన్న మూడు సినిమాలు కొన్నాళ్ళు పక్కన పెట్టారు. ఇటీవల పవన్ ఓ మీటింగ్ లో మాట్లాడుతూ ఎలాగైనా వాటికి డేట్స్ ఇచ్చి ఆ మూడు సినిమాలు పూర్తిచేస్తానని తెలిపారు. దీంతో పవన్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. పవన్ కెరీర్ లో మొదటి పీరియాడిక్ సినిమాగా హరిహర వీరమల్లు ఎప్పుడో మొదలుపెట్టారు.

కానీ అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఇటీవల మళ్ళీ రెగ్యులర్ షూట్ మొదలుపెట్టింది. ఆగస్టు 14 నుంచి హరిహర వీరమల్లు భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ జరుగుతుంది. త్వరలోనే పవన్ కళ్యాణ్ కూడా షూట్ లో జాయిన్ అవుతాడని నిర్మాతలు నిన్నే ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు.

Also Read : Chiranjeevi – Ramya : చిరంజీవికి చెల్లెలిగా ఈ హీరోయిన్.. ‘విశ్వంభర’ సీక్రెట్స్ చెప్పేసిన భామ..

హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నిధి ఓ మహారాణి పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా నేడు నిధి అగర్వాల్ పుట్టిన రోజు కావడంతో ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ లో నిధి అగర్వాల్ మహారాణిలా నిండుగా ఆభరణాలతో రెడీ అయింది. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. ఇక హరిహర వీరమల్లు రెండు పార్టులుగా రానుంది. ఈ సినిమాలు పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానున్నాయి. పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్స్ బట్టి వచ్చే సంవత్సరం హరిహర వీరమల్లు రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు