Chiranjeevi – Ramya : చిరంజీవికి చెల్లెలిగా ఈ హీరోయిన్.. ‘విశ్వంభర’ సీక్రెట్స్ చెప్పేసిన భామ..

విశ్వంభర సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమే అని క్లారిటీ ఇచ్చింది ఓ నటి.

Chiranjeevi – Ramya : చిరంజీవికి చెల్లెలిగా ఈ హీరోయిన్.. ‘విశ్వంభర’ సీక్రెట్స్ చెప్పేసిన భామ..

Actress Ramya Pasupuleti says Interesting Facts about Megastar Chiranjeevi Movie Vishwambhara

Updated On : August 17, 2024 / 9:05 AM IST

Chiranjeevi – Ramya : మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాతికి రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. అయితే ఈ సినిమా ఒక విజువల్ వండర్ అని, సోషియో ఫాంటసీ థ్రిల్లర్ అని ముందు నుంచి చెప్తూ అంచనాలు పెంచుతున్నారు. కానీ విశ్వంభర సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుందని వార్తలు వచ్చాయి.

తాజాగా ఆ వార్తలు నిజమే అని క్లారిటీ ఇచ్చింది ఓ నటి. సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకున్న తెలుగమ్మాయి రమ్య పసుపులేటి ఇప్పుడు హీరోయిన్ గా ఛాన్సులు తెచ్చుకుంటుంది. త్వరలో మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమాతో రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రమ్య విశ్వంభర సినిమా గురించి మాట్లాడింది.

Also Read : National Award Actress : ఈ చిన్ని పాప ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నర్..

రమ్య పసుపులేటి మాట్లాడుతూ.. చిరంజీవి గారి పక్కన సిస్టర్ గా విశ్వంభర సినిమాలో చేస్తున్నాను. ఆయనతో చాలా సేపు స్క్రీన్ లో కనిపిస్తాను. ఆయనతో ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోరు. అందుకే చెల్లి పాత్ర అయినా చేసాను. నాకు చాలా సపోర్టింగ్ రోల్స్ వచ్చాయి కానీ హీరోయిన్ గా చేద్దామనే అవేవి చేయలేదు. ఇపుడు ఓన్లీ చిరంజీవి పక్కన ఛాన్స్ అని మాత్రమే చెల్లి పాత్రకు ఒప్పుకున్నాను. నాతో పాటు వేరే హీరోయిన్స్ కూడా చిరంజీవి పక్కన చెల్లెళ్లుగా చేస్తునారు అని తెలిపింది. దీంతో రమ్య వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

విశ్వంభర సినిమాలో రమ్యతో పాటు హీరోయిన్ సురభి, మరో సీనియర్ నటి చిరంజీవికి చెలెళ్ళుగా చేస్తున్నారని సమాచారం. ఇక త్రిష, ఆషికా రంగనాథ్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారని ఆల్రెడీ అధికారికంగా ప్రకటించారు. ఓ పక్క సోషియో ఫాంటసీ అంటూనే మరో పక్క సిస్టర్ సెంటిమెంట్ అని చెప్తుండటంతో సినిమా ఎలా ఉండబోతుందో అని మరింత ఆసక్తి నెలకొంది.