Pawan Kalyan Podcast: ‘బారాముల్లా’ సినిమాపై పవన్ కళ్యాణ్ రివ్యూ.. ఆ సినిమా నచ్చింది అంటూ..
జాతీయవాదం ఉన్న సినిమాల గురించి ప్రశ్న రాగా దురంధర్, బారాముల్లా సినిమాల గురించి మాట్లాడారు. (Pawan Kalyan)
- Saketh U
- Updated on- June 11, 2026 / 11:03 AM IST
Pawan Kalyan Comments On Dhurandhar Baramulla Movie
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా నేషనల్ మీడియా ANI కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో జాతీయవాదం ఉన్న సినిమాల గురించి ప్రశ్న రాగా దురంధర్ , బారాముల్లా సినిమాల గురించి మాట్లాడారు.
ధురంధర్ సినిమా గురించి మాట్లాడుతూ.. నాకు ధురంధర్ సినిమా బాగా నచ్చింది. ఆ సినిమాలో బోల్డ్ నెస్ నచ్చింది. సినిమా తీసిన విధానం నచ్చింది. కానీ నాకు సమయం లేకపోవడం వల్ల ఇంకా పార్ట్ 2 చూడలేదు అని అన్నారు.
Also Read – NBK 111 Glimpse : OG సినిమాని గుర్తుచేస్తున్న బాలయ్య కొత్త సినిమా గ్లింప్స్.. జస్ట్ మ్యూజిక్ మారిస్తే చాలు..
ఇక మరో సినిమా బారాముల్లా గురించి మాట్లాడుతూ.. నాకు బారాముల్లా సినిమా బాగా నచ్చింది. అది నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఎందుకంటే నాకు హారర్ సినిమాలు ఇష్టం. రాత్రి పూట నిద్ర రాకపోతే నేను హారర్ సినిమాలు చూస్తాను అప్పుడప్పుడు. అలా ఓ రోజు బారాముల్లా సినిమాని చూసాను. ఆ సినిమాలో చెప్పిన పాయింట్ కొత్తగా ఉంది. అందులో ఉన్న కాశ్మీర్ అంశాలు నాకు కనెక్ట్ అయ్యాయి. ఆ సినిమాలో చెప్పిన పాయింట్ ని చాలా గొప్పగా చెప్పారు. కాశ్మీర్ పండితుల బాధలను చూపించారు. నేను కాశ్మీర్ కి సినిమా షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు కొన్ని సంఘటనలు చూసాను. మమ్మల్ని కూడా వెళ్లిపోండి అన్నారు. ఎవరైనా గెట్ అవుట్ అంటే నాకు నచ్చదు. అందుకే బారాముల్లా సినిమాకు కనెక్ట్ అయ్యాను అని తెలిపారు.
బారాముల్లా సినిమా తీవ్రవాదం, హారర్ అంశాలు కలిపి సరికొత్తగా తెరకెక్కించిన ఒక సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా. కాశ్మీర్ లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఓ ఫ్యామిలీ, పోలీస్ ఆఫీసర్, ఆత్మలు, కాశ్మీర్ పండితుల బాధలు, తీవ్రవాదం.. అంశాలతో ఈ సినిమా కథ ఆసక్తిగా సాగుతుంది. జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ బ్యానర్‌పై ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సినిమాని నిర్మించాడు. ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది. గత సంవత్సరం నవంబర్ లో ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయింది.
Also Read – Sreeja Konidela : నాకే ఎందుకిలా జరుగుతోంది? ఎందుకింత బాధ.. చిరంజీవి కూతురు వీడియో వైరల్..
అలాగే హిందీ సినిమాలు వర్సెస్ సౌత్ సినిమాలు అంటూ ప్రశ్నించగా.. అలాంటి వాదన అనవసరం. హిందీ సినిమాలు చూస్తాము. సాంగ్స్ వింటాము మేము కూడా అని అన్నారు పవన్.
