Pawan Kalyan : అన్‌స్టాపబుల్ షోకి పవన్ కళ్యాణ్.. వైరల్ అవుతున్న నాగవంశీ ట్వీట్!
నందమూరి బాలకృష్ణ వెండితెర మీదనే కాదు బుల్లితెర మొద కూడా రికార్డులు సృష్టిస్తున్నాడు. తను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అన్‌స్టాపబుల్ టాక్ షోని అన్‌స్టాపబుల్ గా ముందుకు తీసుకు వెళుతున్నాడు. తాజాగా ఈ టాక్ షో గురించి ఒక అదిరిపోయే న్యూస్ బయటకి వచ్చింది. అందేంటంటే..
- gum 95921
- Published On : December 16, 2022 / 08:59 AM IST
Pawan Kalyan is coming to unstoppable show
Pawan Kalyan : నందమూరి బాలకృష్ణ వెండితెర మీదనే కాదు బుల్లితెర మొద కూడా రికార్డులు సృష్టిస్తున్నాడు. తను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అన్‌స్టాపబుల్ టాక్ షోని అన్‌స్టాపబుల్ గా ముందుకు తీసుకు వెళుతున్నాడు. తన చలాకీతనంతో మొదటి సీజన్ ని సూపర్ హిట్టుగా మలిచిన బాలయ్య.. సెకండ్ సీజన్ ని అంతకుమించి చిలిపితనంతో మరియు ముక్కుసూటి ప్రశ్నలతో మరెంత బ్లాక్ బస్టర్ గా నిలుపుతున్నాడు.
Unstoppable 2: బాలయ్య టాక్ షోలో మ్యాచో స్టార్ స్పెషల్ ఎంట్రీ.. ఒరేయ్ అంటూ ప్రభాస్ బెదిరింపు!
తాజాగా ఈ టాక్ షో గురించి ఒక అదిరిపోయే న్యూస్ బయటకి వచ్చింది. అందేంటంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో అన్‌స్టాపబుల్ షోకి రాబోతున్నాడట. గతంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ టాక్ షోకి వచ్చినప్పుడు, త్రివిక్రమ్ కి ఫోన్ కాల్ చేసి అన్‌స్టాపబుల్‌కి నువ్వు, పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తున్నారు అంటూ బాలయ్య అడిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న నాగవంశీ తన సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది.
‘డిసెంబర్ 27న వచ్చే బ్లాక్ బస్టర్ అప్డేట్ కోసం రెడీగా ఉండండి’ అంటూ ఆహాని ట్యాగ్ చేయడంతో చర్చనీయాంశం అయ్యింది. పవన్ కళ్యాణ్ ఈ షోకి రావడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో తరువాతి ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 27న ఈ ఎపిసోడ్ షూటింగ్ జరగనుంది అని తెలుస్తుంది.
అయితే ఎటువంటి టాక్ షోలో గాని, ఇంటర్వూలో గాని అటెండ్ కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ షోకి వస్తున్నాడని తెలియడం. అది బాలయ్య హోస్ట్ గా ఉన్న షోకి వస్తుండడంతో, ఈ షోలో బాలయ్య.. పవన్ వ్యక్తిగత జీవితం దగ్గర నుండి రాజకీయ విషయాల వరకు ఎటువంటి ప్రశ్నలు వెయ్యబోతున్నాడో అని ఇప్పటినుంచే ఆశక్తి నెలకుంది.
Get Ready for a smashing blast of Fireworks this 27th December ??
Stay Tuned to @ahavideoIN ✨
— Naga Vamsi (@vamsi84) December 15, 2022
