Janasena : జనసేన ఆవిర్భావ వేడుకలు.. రెండు కిలోమీటర్లు పైగా పవన్ కాలినడక.. ఎప్పుడు ఎక్కడ..?

తాజాగా జనసేన పార్టీ దీనిపై అధికారిక ప్రకటన చేసింది. (Janasena)

  • Published On : March 13, 2026 / 06:46 PM IST

Janasena

Janasena : మార్చ్ 14 జనసేన ఆవిర్భావ దినోత్సవం. గత సంవత్సరం జనసేన ఆవిర్భావ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. కానీ ఈ సారి మాత్రం చాలా సింపుల్ గా నిర్వహించాలని పవన్ కళ్యాణ్, పార్టీ నిర్ణయించుకున్నారు. దీంతో పవన్ ఈసారి జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎక్కడ జరుపుకుంటారు అనే ఆసక్తి నెలకొంది.

తాజాగా జనసేన పార్టీ దీనిపై అధికారిక ప్రకటన చేసింది. గిరిజనం మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం పవన్ కళ్యాణ్ నిర్వహించనున్నారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఈ సారి గిరి పుత్రుల మధ్య నిర్వహించుకోవాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. పార్టీ శ్రేణులకు ఇచ్చిన పిలుపు మేరకు గ్రామ స్థాయిలో జరిగే వేడుకల్లో స్వయంగా పాల్గొననున్నారు.

Also See : Allu Cinemas Inside Photos : కొత్తగా ఓపెన్ అయిన అల్లు సినిమాస్.. లోపల ఎంత బాగుందో చూడండి.. ఫొటోలు..

మార్చ్ 14 శనివారం పాడేరు నియోజకవర్గం, నందిగరువు అనే గిరిజన గ్రామంలో ఈ వేడుకలను పవన్ నిర్వహించనున్నారు. తొలుత పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓనూరు జంక్షన్ వద్ద జనసేన జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ప్రధాన మంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్ మన్), జాతీయ గ్రామీణ ఉపాధి హామీ తదితర పథకాల ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో చేపట్టిన రోడ్ల నిర్మాణం పనులను పరిశీలిస్తారు.

పీఎం జన్ మన్ పథకం నిధులతో ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు గ్రామం వరకు నిర్మించిన 2.4 కిలోమీటర్ల రహదారి మొత్తం నడుస్తూ కాలి నడకన పరిశీలిస్తూ ఆ గ్రామానికి చేరుకుంటారు. నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేస్తూ మార్గమధ్యంలో గిరిజనులతో మమేకం అవుతారు. అనంతరం అడవితల్లి బాట కార్యక్రమం ద్వారా నిర్మాణం పూర్తయిన రోడ్లను పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారు. నందిగరువు గ్రామ ప్రజలతో నిర్వహించే మాటా మంతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం గిరిజనులతో కలసి భోజనం చేస్తారు. దీంతో ఆ గ్రామం చుట్టుపక్కల జనసేన శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. అభిమానులు, కార్యకర్తలు ఆ గ్రామానికి భారీగా తరలి రానున్నట్టు తెలుస్తుంది.

Also Read : Indian Railways: తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణీకులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఇక ఈ 3 స్పెషల్ రైళ్లు రెగ్యులర్‌ సర్వీసులుగా మార్పు