Pawan Kalyan Meeting with his Upcoming Movie Producers OG Movie Release Date Fix
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో చేతిలో ఉన్న సినిమాలకు డేట్స్ ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా ఉండటంతో మరింత బిజీ అవ్వగా సినిమాలకు అస్సలు సమయం కేటాయించలేకపోతున్నారు. ఒప్పుకున్న మూడు సినిమాలు హరిహర వీరమల్లు, OG , ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేసేసి సినిమాలు ఆపేద్దామన్నా డేట్స్ ఇచ్చిన ప్రతిసారి మధ్యలోనే ఏదో ఒక అడ్డంకి రావడం పవన్ వెళ్లిపోవడం జరుగుతుంది.
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా నిర్మాతలను పిలిచి మాట్లాడారట. నిన్న పవన్ కళ్యాణ్ మైత్రీ నవీన్, డీవీవీ దానయ్యలను పిలిపించి మాట్లాడారట. జూలై నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు డేట్లు ఇస్తారట. జూలై లోపే OG సినిమా షూట్ కూడా పూర్తి చేయడానికి డేట్స్ ఇస్తారట. ఇక హరిహర వీరమల్లు సినిమాకు కేవలం ఓ వారం రోజులు డేట్స్ ఇస్తే సరిపోతుంది కాబట్టి మే మొదట్లో డేట్స్ ఇస్తారట. ఆ తర్వాత 20 రోజులు విడతల వారీగా OG సినిమాకు డేట్స్ ఇస్తారట. అలా ఈ ఇయర్ లో సినిమాలు పూర్తి చేసేస్తారని పవన్ నిర్మాతలకు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది.
Also Read : Allu Arjun : ముంబైలో బన్నీ లుక్ టెస్ట్.. అట్లీ సినిమా కోసం..
పవన్ భరోసా ఇవ్వడంతో తాజాగా OG సినిమా సెప్టెంబర్ 5 న రిలీజ్ చేయాలని, త్వరలోనే అధికారికంగా డేట్ అనౌన్స్ చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తుందట. మరి ఇప్పటికైనా పవన్ డేట్స్ ఇచ్చి సినిమాలు పూర్తిచేసి రిలీజ్ చేస్తారా చూడాలి.