Allu Arjun : ముంబైలో బన్నీ లుక్ టెస్ట్.. అట్లీ సినిమా కోసం..
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తోన్న సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది.

Allu Arjun Look Test Happened in Mumbai for Atlee Movie
Allu Arjun : ప్రతీ సినిమాకి కొత్త లుక్ తో ఆడియెన్స్ ను సర్ప్రైజ్ చేసే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప, పుష్ప2 సినిమాల కోసం 5 ఏళ్లు ఒకే గెటప్ ను మెయింటైన్ చేశారు. లాంగ్ కర్లీ హెయిర్ తో, గుబురు గడ్డంతో, రగ్డ్ అవతార్ లో కనిపించి పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశారు అల్లు అర్జున్. ఇప్పుడు డైరెక్టర్ అట్లీతో చేయబోయే సైన్స్ ఫిక్షన్ సినిమా కోసం మరో డిఫరెంట్ లుక్ లోకి మేకోవర్ అవ్వబోతున్నారు ఐకాన్ స్టార్.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తోన్న సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. లేటెస్ట్ గా ముంబైలోని మోహబూబ్ స్టూడియోలో అల్లు అర్జున్ పై లుక్ టెస్ట్ తో పాటు కాన్సెప్ట్ ఫొటోషూట్ చేసినట్లు తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ప్యార్లల్ స్పేస్, పునర్జన్మల కాన్సెస్ట్ తో వస్తోన్న ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్ గెటప్ లో కనిపించే ఛాన్స్ ఉందంటున్నారు.
అందుకు తగ్గట్లే రగ్గ్డ్, స్లీక్, ఫ్యూచరిస్టిక్, ఔటర్ స్పేస్ ఇలా కొన్ని లుక్స్ ను అల్లు అర్జున్ పై కాన్సెప్ట్ ఫొటోషూట్ చేసినట్లు తెలుస్తోంది. వీటిలో దాదాపు రెండు లుక్స్ ను ఫైనల్ చేసే ఛాన్సుంది. అల్లు అర్జున్ 22వ సినిమాగా అట్లీ ఆరవ సినిమాగా వస్తోన్న ఈ ప్రాజెక్ట్ ను దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. మహేశ్-రాజమౌళి తర్వాత ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఇదే.
హాలీవుడ్ టాప్ VFX టెక్నిషియన్స్ లోలా VFX ఈ ప్రాజెక్ట్ లో పార్ట్ అవ్వడంతో మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను సూపర్ ఫాస్ట్ గా జరుపుకుంటోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా నటించే లక్కీ హీరోయిన్స్ ఎవరంటూ తెగ చర్చించుకుంటున్నారు ఆడియెన్స్. మొత్తానికి రోజు రోజుకి అల్లు అర్జున్ – అట్లీ సినిమాపై అంచనాలు పెంచుతూనే ఉన్నారు.
Also Read : Nani : మేము టెర్రరిస్టులం కాదు కదా.. ఎందుకు అలా చేస్తున్నారు.. ఆ ఇష్యూ పై నాని కామెంట్స్..