Pawan Kalyan : ఎయిర్ పోర్ట్‌లో అభిమానులతో సందడి చేసిన డిప్యూటీ సీఎం.. చిన్ని అభిమానిని ఎత్తుకొని..

పవన్ అక్కడ ఎయిర్ పోర్ట్ లో ఉన్న ఫ్యాన్స్ ని, ప్రయాణికుల్ని కలిసి వారితో కాసేపు ముచ్చటించారు.

  • Updated on- August 1, 2024 / 06:43 AM IST

Pawan Kalyan Meets Fans at Gannavaram Airport

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయానికి రాగా అక్కడున్న ప్రయాణీకులు, అభిమానులు ఆయన్ని కలవడానికి ఆసక్తి చూపారు. అరుపులు, విజిల్స్ తో సందడి చేసారు.

Also Read : Niharika : నాన్న మంగళగిరిలోనే ఉంటున్నారు.. వదిన కాలికి ఫ్రాక్చర్.. అన్నేమో.. ఫ్యామిలీపై నిహారిక కంప్లైంట్స్..

దీంతో పవన్ అక్కడ ఎయిర్ పోర్ట్ లో ఉన్న ఫ్యాన్స్ ని, ప్రయాణికుల్ని కలిసి వారితో కాసేపు ముచ్చటించారు. అక్కడ ఉన్న ఓ చిన్ని అభిమానిని ఎత్తుకొని ఆ ఫ్యామిలీతో సరదాగా మాట్లాడారు. దీంతో ఆ ఫ్యామిలీ సంబరపడిపోయింది.

పవన్ కళ్యాణ్ ఇలా ఎయిర్ పోర్ట్ లో ఆగి అక్కడ ఉన్న వారితో మాట్లాడటం, చిన్ని అభిమానిని ఎత్తుకోవడంతో ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. దీంతో అంత బిజీలో ఉండి కూడా ఇలా ఫ్యాన్స్ తో ముచ్చటించడంతో పవన్ ని అభినందిస్తున్నారు.