Niharika : నాన్న మంగళగిరిలోనే ఉంటున్నారు.. వదిన కాలికి ఫ్రాక్చర్.. అన్నేమో.. ఫ్యామిలీపై నిహారిక కంప్లైంట్స్..

నిహారిక తన ఫ్యామిలీపై కంప్లైంట్స్ చేసింది.

Niharika : నాన్న మంగళగిరిలోనే ఉంటున్నారు.. వదిన కాలికి ఫ్రాక్చర్.. అన్నేమో.. ఫ్యామిలీపై నిహారిక కంప్లైంట్స్..

Niharika Konedela Complaints on Her Family regarding Movie Promotions

Updated On : July 31, 2024 / 6:50 PM IST

Niharika Konidela : మెగా డాటర్ నిహారిక నిర్మాతగా నిర్మించిన మొదటి సినిమా కమిటీ కుర్రాళ్లు ఆగస్టు 9న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ సినిమా ప్రమోషన్స్ కి మెగా ఫ్యామిలీ నుంచి ఎవర్ని వాడుకోలేదు ఎందుకు, అసలు మెగా ఫ్యామిలీకి ఈ సినిమా కంటెంట్ చూపించారా అని అడగ్గా నిహారిక ఆసక్తికర సమాధానమిచ్చింది.

Also Read : Raj Tarun : నెల రోజుల్లోనే ఇంకో సినిమా రిలీజ్ చేస్తాను.. రాజ్ తరుణ్ బ్యాక్ టు బ్యాక్ సంవత్సరంలో నాలుగు సినిమాలు..

నిహారిక మాట్లాడుతూ.. ప్రమోషన్స్ కి మా నాన్నే దొరకట్లేదు. ఇంక పెదనాన్న ఏం దొరుకుతారు. మా నాన్న మంగళగిరిలోనే ఉంటున్నారు. పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు. అసలు ఇంటికి రావట్లేదు. అన్నయ్యేమో వైజాగ్ లో షూటింగ్ లో ఉన్నాడు. మా వదిన కాలు ఫ్రాక్చర్ అయి డెహ్రాడూన్ లో ఉంది. చరణ్ అన్న, పెదనాన్న పారిస్ ఒలంపిక్స్ కి వెళ్లారు. కళ్యాణ్ బాబాయ్ పాలిటిక్స్ లో బిజీ. నా సినిమా టైంకి ఇలా అందరూ బిజీ అయిపోయారు. ఇంక వాళ్లకి కంటెంట్ చూపించలేదు. వచ్చాక చూపించాలి. నా సినిమా టైంకి అందరూ తప్పించుకున్నారు అని సరదాగా కంప్లైంట్ చేసింది.