Raj Tarun : నెల రోజుల్లోనే ఇంకో సినిమా రిలీజ్ చేస్తాను.. రాజ్ తరుణ్ బ్యాక్ టు బ్యాక్ సంవత్సరంలో నాలుగు సినిమాలు..

రాజ్ తరుణ్ నేడు తిరగబడరా సామి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు.

Raj Tarun : నెల రోజుల్లోనే ఇంకో సినిమా రిలీజ్ చేస్తాను.. రాజ్ తరుణ్ బ్యాక్ టు బ్యాక్ సంవత్సరంలో నాలుగు సినిమాలు..

Raj Tarun Gives Clarity on his Next Movies coming with new movie with in one month

Updated On : July 31, 2024 / 5:22 PM IST

Raj Tarun Movies : గత కొన్ని రోజులుగా లావణ్య వివాదంతో బయటకి రాని రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రా తాజాగా నేడు తిరగబడరా సామి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు. దీంతో మీడియా లావణ్య వివాదం గురించి, అలాగే సినిమా గురించి పలు ప్రశ్నలు అడిగారు. రాజ్ తరుణ్ నెక్స్ట్ సినిమాల గురించి, ఈ వివాదంతో ఫ్యూచర్ కెరీర్ గురించి ప్రశ్నించగా రాజ్ తరుణ్ సమాధానమిచ్చాడు.

రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. సినిమాలు సినిమాలే. ఈ సంవత్సరం నా సామిరంగ సినిమాలో నాగార్జున గారి పక్కన ఒక రోల్ చేశాను. ఆ సినిమా హిట్ అయింది. మొన్న పురుషోత్తముడు సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇప్పుడు తిరగబడరా సామీ సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నెల రోజుల్లోనే మళ్ళీ ఇంకో సినిమాతో వస్తాను. నా నెక్స్ట్ సినిమా ‘భలే ఉన్నాడే’ నెల రోజుల్లో వస్తుంది అని తెలిపారు.

Also Read : Raj Tarun – Lavanya : లావణ్య వివాదం తర్వాత ఎందుకు బయటకు రాలేదు.. సమాధానం ఇచ్చిన రాజ్ తరుణ్..

నా సామిరంగ సినిమా సంక్రాంతికి విడుదలయి మంచి హిట్ కొట్టింది. ఇటీవల జులై 26 పురుషోత్తముడు సినిమా రిలీజయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు తిరగబడరా సామీ సినిమా ఆగస్టు 2న రిలీజ్ కాబోతుంది. ఇలా ఒకే సంవత్సరంలో రాజ్ తరుణ్ నాలుగు సినిమాలతో రావడం గ్రేట్ అని చెప్పొచ్చు.