Pawan kalyan : ‘భీమ్లా నాయక్’ సాంగ్ లో పవన్ కళ్యాణ్ గెటప్ లీక్.. వైరల్ అవుతున్న పవన్ న్యూ లుక్

'భీమ్లా నాయక్' సినిమా కోసం ఓ ప్రమోషనల్ సాంగ్ చివరి రోజు షూటింగ్ జరుపుకుంటుండగా అందులో పవన్ కళ్యాణ్ లుక్ లీక్ అయింది. ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ పంచ కట్టు, గొంగళి తో, చేతిలో కర్ర......

Pawan Kalyan Bheemla Nayak

 

Bheemla Nayak :  ఇటీవల కాలంలో సినిమా వారికీ లీకుల బెడద పట్టుకుంది. కొన్ని రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాల్లోంచి పాటలో, సన్నివేశాలో లీక్ అవుతుంటే మరి కొన్ని సినిమాల నుంచి షూటింగ్ టైంలో పిక్స్ లీక్ అవుతున్నాయి. స్టార్ హీరోలకి సైతం ఈ లీకుల బెడద తప్పట్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత సినిమా ‘వకీల్ సాబ్’ టైం లోనూ షూటింగ్ సమయంలో కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. తాజాగా ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి కూడా షూటింగ్ పిక్స్ లీక్ అయ్యాయి.

‘భీమ్లా నాయక్’ సినిమా కోసం ఓ ప్రమోషనల్ సాంగ్ చివరి రోజు షూటింగ్ జరుపుకుంటుండగా అందులో పవన్ కళ్యాణ్ లుక్ లీక్ అయింది. ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ పంచ కట్టు, గొంగళి తో, చేతిలో కర్ర పట్టుకొని ఉన్నారు. పక్కా పల్లెటూరి గెటప్ లో ఉన్నారు పవన్. పవన్ నుంచి ఇలాంటి గెటప్ ఇదే ఫస్ట్ టైం. దీంతో షూటింగ్ టైంలో తీసిన ఫోటో లీక్ అవ్వడంతో బాగా వైరల్ అవుతుంది.

Pawan Kalyan : రష్యా, ఐరోపా దేశాల్లో కూడా బప్పీ లహరి పాటలు వినిపిస్తాయి

ఇప్పటికే పవన్ కళ్యాణ్ మరో సారి పోలీస్ పాత్రలో నటిస్తుండటంతో పాటు, ఈ సినిమాలోని సాంగ్స్ బాగా ప్రజాదరణ పొందడంతో పాటు రానాతో కలిసి మల్టీస్టారర్ అవ్వడంతో సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఈ లుక్ వైరల్ అయిన తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ‘భీమ్లా నాయక్’ సినిమాని ఫిబ్రవరి 25న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించారు. అభిమానులు, ప్రేక్షకులు ‘భీమ్లా నాయక్’ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.