OG First Look : పవన్ అభిమానులకు నిరాశ.. OG ఫస్ట్ లుక్ లేదు.. కానీ..
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న OG సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేస్తారని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు.
- Saketh U
- Published on- August 28, 2023 / 12:12 PM IST
Pawan Kalyan OG First Look cancelled direct Teaser will Releasing on September 2nd
Pawan Kalyan OG First Look : పవన్ కళ్యాణ్(Pawan Kalyan) త్వరత్వరగా సినిమాలు పూర్తి చేసేయాలని చూస్తున్నారు. ఎలక్షన్స్ కి కొన్ని నెలల ముందే OG సినిమా, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాల షూటింగ్స్ పూర్తి చేయాలని ట్రై చేస్తున్నారు. పవన్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాల్లో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సుజిత్(Sujeeth) దర్శకత్వంలో DVV దానయ్య నిర్మాణంలో They Call him OG సినిమా భారీగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రియాంక మోహన్(Priyanka Mohan) హీరోయిన్ గా, తమిళ నటుడు అర్జున్ దాస్, నటి శ్రియా రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో నటిస్తాడని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కోసం పవన్ మార్షల్ ఆర్ట్స్ చేసిన ఫోటోలు లీక్ అవ్వడంతో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. OG సినిమాపై కావాల్సినంత హైప్ ఉంది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న OG సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేస్తారని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు.
OG మూవీ టీజర్ ఒక నిమిషం కంటే ఎక్కువే ఉంటుందని, అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ ఉండబోతుందని తెలియడంతో టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే టీజర్ కి ముందే పవన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని కూడా అభిమానులు భావించారు. కానీ దీనిపై అభిమానులకు నిరాశే ఎదురైంది. తాజాగా DVV నిర్మాణ సంస్థ అధికారికంగా OG సినిమా నుంచి ఎలాంటి ఫస్ట్ లుక్ ఉండదని, డైరెక్ట్ సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు నాడు టీజర్ ఉంటుందని ప్రకటించారు.
టీజర్ పై మరింత అంచనాలు పెంచడానికి గన్ పట్టుకున్న పవన్ కళ్యాణ్ చెయ్యి ఉన్న ఓ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ.. #HUNGRYCHEETAH కోసం వెయిట్ చేయండి. ఆకలితో ఉన్న చిరుతపులి ఎలా ఉంటుంది చూడటానికి వెయిట్ చేయండి అని చెప్తూ టీజర్ పై హైప్ పెంచారు. దీంతో అభిమానులు పవన్ OG టీజర్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సుజీత్ ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి మరి.
