×
Ad

Indian Samurai – Pawan kalyan : ‘ఇండియన్ సమురాయ్’.. పవన్ OG యానిమేటెడ్ షార్ట్ ఫిలిం చూసారా? అదిరిపోయింది అంతే..

'ఇండియన్ సమురాయ్' అనే పేరుతో పవన్ అభిమాని చేసిన యానిమేటెడ్ షార్ట్ ఫిలిం ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియాల్లో ట్రెండ్ అవుతుంది.

  • Published On : August 29, 2024 / 03:22 PM IST

Pawan Kalyan OG Indian Samurai Animated Short Film goes Viral

Indian Samurai – Pawan kalyan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చినా పొలిటికల్ గా ఫుల్ ఫామ్ లో ఉండటంతో పవన్ ఫ్యాన్స్ ఇప్పటికే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి రెడీ అవుతున్నారు అభిమానులు.

పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాల్లో OG సినిమాపై భారీ హైప్ ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ జపనీస్ మార్షల్ ఆర్ట్స్ చేసే పాత్రలో, గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నాడని ఆ గెటప్ లుక్స్ కూడా రిలీజ్ అవ్వడంతో అంచనాలు పెరిగాయి. అయితే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వస్తుండటంతో ఓ అభిమాని పవన్ కళ్యాణ్ OG సినిమా ఆధారంగా ఓ చిన్న యానిమేటెడ్ షార్ట్ ఫిలిం చేసాడు.

Also Read : Kalki : ప్ర‌భాస్ పై అర్ష‌ద్ వార్సీ ‘జోక‌ర్’ కామెంట్.. స్పందించిన క‌ల్కి నిర్మాత‌

‘ఇండియన్ సమురాయ్’ అనే పేరుతో పవన్ అభిమాని చేసిన యానిమేటెడ్ షార్ట్ ఫిలిం ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియాల్లో ట్రెండ్ అవుతుంది. ఇందులో పవన్ లాగే కనపడే యానిమేటెడ్ క్యారెక్టర్ అదిరిపోయే జపాన్ మార్షల్ ఆర్ట్స్ చేసింది. అలాగే విలన్స్ ని సమురాయ్ కత్తితో ఎదిరించింది. సినిమాల్లో చూపించే రేంజ్ లో హీరో ఎలివేషన్స్ తో ఈ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం తయారుచేసారు.

ఇంకేముంది ఇండియన్ సమురాయ్ షార్ట్ ఫిలిం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ ఫ్యాన్స్ ఈ షార్ట్ ఫిలిం చూసి ఆశ్చర్యపోయి అదిరిపోయింది అంటుంటే మిగిలిన నెటిజన్లు ఈ యానిమేటెడ్ షార్ట్ ఫిలింని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఈ షార్ట్ ఫిలిం మొత్తాన్ని డిజైన్ చేసి రెడీ చేసింది హ్యారీ కురుకుల అనే పవన్ అభిమాని. పవన్ పుట్టిన రోజుకి ఫ్యాన్స్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారని ఆ వీడియోని తయారుచేసిన వ్యక్తులని అభినందిస్తున్నారు. ఈ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం చేయడానికి కొన్ని నెలలు పట్టిందని దీన్ని చేసినవాళ్లు తెలిపారు. మీరు కూడా పవన్ కళ్యాణ్ ఇండియన్ సమురాయ్ షార్ట్ ఫిలిం చూసేయండి..