Kalki : ప్రభాస్ పై అర్షద్ వార్సీ ‘జోకర్’ కామెంట్.. స్పందించిన కల్కి నిర్మాత
కల్కి మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాత్రను తక్కువ చేస్తూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

Kalki producer loved Nag Ashwins reply to Arshad Warsis joker comment
కల్కి మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాత్రను తక్కువ చేస్తూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. వీటిని ఖండిస్తూ పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. దీనిపై కల్కి మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే స్పందించగా తాజాగా ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైన స్వప్నదత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించిన తీరు తనకు బాగా నచ్చిందన్నారు.
ప్రభాస్ అంటే ఏమిటో కల్కి మూవీ నిరూపించింది. అందుకనే తాము మౌనంగా ఉన్నామన్నారు. ప్రభాస్ ఎప్పటిలాగానే ఈ మూవీలోనూ అద్భుతంగా నటించాడని చెప్పారు. దర్శకుడు నాగ్ అశ్విన్, హీరో ప్రభాస్ ఇద్దరూ గొప్ప వ్యక్తులు అని, అందుకనే షూటింగ్ చాలా సులభమైందన్నారు. ఇక అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలపై నాగ్ అశ్విన్ స్పందించిన తీరు బాగుందన్నారు.
Saripodha Sanivaaram : నాని ‘సరిపోదా శనివారం’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! స్ట్రీమింగ్ అప్పుడేనా?
అర్షద్ ఇంటికి కల్కి బొమ్మలను పంపిస్తామని నాగ్ అశ్విన్ చెప్పారు. రెండో పార్ట్ కోసం మరింత కష్టపడతానని, అందులో ప్రభాస్ ను మరింత బెస్ట్‌గా చూపిస్తానని అన్నారు. అర్షద్ వార్సీ కొంచెం హుందాగా మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. ఇలా స్పందించడం నాగ్ అశ్విన్ గొప్పతనానికి నిదర్శనం అని స్వప్నదత్ తెలిపారు.
అర్షద్ ఏం అన్నాడంటే..?
‘కల్కి మూవీ చూశా.. అయితే ఈ మూవీ నాకు నచ్చలేదు. ఇక అమితాబ్ బచ్చన్ మాత్రం అశ్వత్థామగా అదరగొట్టాడు. ఈ వయసులో ఆయన ఇలా నటించడం చాలా గొప్ప విషయం. ఆయనకు ఉన్న శక్తిలో నాకు కొంచెం అయిన ఉండి ఉంటే ఈ పాటికే లైఫ్ సెట్ అయిపోయేది. ఇక మూవీలో ప్రభాస్ పోషించిన పాత్ర బాగాలేదు. ఆయన పాత్ర ఓ జోకర్‌లా ఉంది. ప్రభాస్‌ను తాను ‘మ్యాడ్ మాక్స్’ లాంటి మూవీలోని మెల్ గిబ్బన్‌లా చూడాలనుకు న్నాను.’ అని అర్షద్ వార్సీ అన్నారు.
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పుట్టిన రోజు నాడే కాంట్రవర్సీలకు పుల్‌స్టాప్ పడబోతోందా?