Saripodha Sanivaaram : నాని ‘సరిపోదా శనివారం’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! స్ట్రీమింగ్ అప్పుడేనా?
వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాని ఇప్పుడు సరిపోదా శనివారం అంటూ వచ్చాడు.

Nani Saripodha Sanivaaram movie OTT Partner fix
Saripodha Sanivaaram OTT Partner : వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాని ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ అంటూ వచ్చాడు. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ కాగా.. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించారు. అభిరామి, అదితి బాలన్, మురళీ శర్మ తదితరులు సినిమాలో కీలక పాత్రల్లో కనిపించారు.
‘అంటే సుందరానికీ’ తర్వాత నాని-వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ కావడంతో ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఎన్నో అంచనాల మధ్యే ఈ సినిమా నేడు (ఆగస్టు 29న) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోషల్ మీడియాలో ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. నాని ఖాతాలో మరో హిట్ పడినట్లేనని అతడి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
‘సరిపోదా శనివారం’ మూవీ రివ్యూ.. శనివారం వస్తే నాని ఏం చేస్తాడు..?
ఇదిలా ఉంటే.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు కూడా వచ్చేశాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో అఫీషియల్‌గా చెప్పేశారు.
కాగా.. భారీ మొత్తానికే నెట్‌ఫ్లిక్స్ సంస్థ చిత్ర స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తరువాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా టాక్. ఈ లెక్కన సెప్టెంబర్ చివర్లో లేదంటే అక్టోబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పుట్టిన రోజు నాడే కాంట్రవర్సీలకు పుల్‌స్టాప్ పడబోతోందా?