OG Satellite Rights: ఇది అస్సలు ఊహించలేదు.. ‘ఓజీ’ శాటిలైట్ రైట్స్ ఎవరు దక్కించుకున్నారో తెలుసా?

పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ శాటిలైట్ రైట్స్(OG Satellite Rights) దక్కించుకున్న ప్రముఖ ఛానెల్.

Pawan Kalyan OG movie satellite Rights Acquired by Etv

  • పవన్ ‘OG’ భారీ బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్.
  • ఈటీవీ సొంతం చేసుకున్న శాటిలైట్ హక్కులు.
  • త్వరలోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్.

OG Satellite Rights: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘OG’ (ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్) బాక్సాఫీస్ వద్ద భారీ విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. సుజిత్ అద్భుతమైన టేకింగ్, పవన్ కళ్యాణ్ వన్-మ్యాన్ షోతో ఈ చిత్రం థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. దీనికి తోడు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై కూడా ఈ సినిమా రికార్డు స్థాయి వ్యూస్‌తో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

Vishnupriya Bhimeneni: ఎరుపు చీరలో.. ఎద అందాలు చూపిస్తూ.. విష్ణు ప్రియ గ్లామర్ రచ్చ

అయితే ఈ చిత్రం ఇప్పటికే డిజిటల్‌గా స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ, దీని శాటిలైట్(OG Satellite Rights) హక్కుల బిజినెస్ మాత్రం గత కొంతకాలంగా సందిగ్ధంలోనే ఉంది. తాజాగా బుల్లితెరపై ‘OG’ ఏ ఛానల్‌లో టెలికాస్ట్ కాబోతుందనే సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం, ప్రముఖ ఛానల్ ‘ఈటీవీ’ (ETV) ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా శాటిలైట్ రైట్స్‌ను భారీ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్‌ను కూడా అనౌన్స్ చేయనున్నారు.

డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి పవర్‌ఫుల్ విలన్ పాత్రలో మెప్పించారు. థియేటర్లు, ఓటీటీలలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘OG’.. ఇప్పుడు బుల్లితెరపై ప్రసారమై ఎలాంటి టీఆర్‌పీ (TRP) రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.