Pawan Kalyan : ఈ ఫోటో ఎలా మిస్ అయ్యాంరా.. లైఫ్ టైం బెస్ట్ ఫ్రెండ్స్ తో డిప్యూటీ సీఎం..

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ - ఆనంద్ సాయి కలిసి దిగిన ఫోటో ఆనంద్ సాయి తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

Pawan Kalyan Photo with his close Friends Anand Sai Trivikram Srinivas

Pawan Kalyan – Trivikram – Anand Sai  : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు ఏపీ ప్రభుత్వ పనులతో మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తిరుమల వెళ్లిన సంగతి తెలిసిందే. పవన్ తో పాటు అతని కూతుళ్లు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, డైరెక్టర్ త్రివిక్రమ్, తమన్.. ఇలా పలువురు ప్రముఖులు వెళ్లారు. తిరుమల నుంచి వీరి ఫోటోలు, వీడియోలు వచ్చి వైరల్ అయ్యాయి. అయితే ఒక స్పెషల్ ఫోటో మాత్రం చాలా తక్కువ మందికి రీచ్ అయింది.

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ – ఆనంద్ సాయి కలిసి దిగిన ఫోటో ఆనంద్ సాయి తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. పవన్ కళ్యాణ్ తన లైఫ్ టైం బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరితో కలిసి దిగిన ఫోటో కావడంతో ఇది ఫ్యాన్స్ కి మరింత స్పెషల్ గా మారింది.

Also Read : Pawan Kalyan – Sayaji Shinde : పవన్ కళ్యాణ్ సర్ అపాయింట్మెంట్ ఇప్పించండి.. ఈ మంచి పని ఆయనతో చేయించాలి..

తొలిప్రేమ సినిమా కంటే ముందు నుంచి కూడా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో స్నేహం ఉంది పవన్ కళ్యాణ్ కు. ఇద్దరూ కలిసి చెన్నై లో బైక్స్ మీద తిరిగేవారు. ఆనంద్ సాయి ఆ తర్వాత పెద్ద ఆర్ట్ డైరెక్టర్ అయ్యాడు, అంతే కాకుండా అనేక ఆలయాలను నిర్మించడంలో శిల్పిగా, వాస్తు సలహాదారుడిగా, ఆర్కిటెక్ట్ గా ప్రముఖ పాత్ర పోషించారు. పవన్ ఆనంద్ సాయి ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. అందుకే ఈ ఇద్దరూ ఎక్కువగా కలిసి కనిపిస్తారు. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక కూడా ఆనంద్ సాయి రెగ్యులర్ గా పవన్ కళ్యాణ్ ని కలుస్తున్నారు. అలా తిరుమలకు పవన్ తో పాటు కలిసి వచ్చారు.

ఇక త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ పరిచయం జల్సా సినిమాతో మొదలయి ఆ తర్వాత మంచి స్నేహితులుగా మారారు. వీరిద్దరి మధ్య ఎంత స్నేహం ఉందంటే పవన్ డైరెక్ట్ త్రివిక్రమ్ ఇంటికి వెళ్లి కావాల్సింది వండించుకొని తింటాడు. ఇక పవన్ కళ్యాణ్ చేసే సినిమాల కథలు త్రివిక్రమ్ వినాల్సిందే. అలా వీరిద్దరి మధ్య కూడా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఇలా ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ తో కలిసి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో కనిపించడంతో ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఇక ఫ్యాన్స్, నెటిజన్లు ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి అని కామెంట్స్ చేస్తున్నారు.