Pawan Kalyan : 15మందిపై అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు.. వైజాగ్ లో తనని నిర్బంధించిన ఇష్యూ పై మాట్లాడిన పవన్

కొన్ని నెలల క్రితం జనసేన పార్టీ తరపున రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకొని మరణించిన కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు కౌలు రైతుల భరోసా యాత్ర పేరుతో ఆ కుటుంబాలకు డబ్బులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఇటీవల కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ వైజాగ్ వచ్చినప్పుడు..........

Pawan Kalyan reacts on vizag issue and AP government in Unstoppable show

Pawan Kalyan : బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షో సూపర్ గా సక్సెస్ అయింది. మొదటి సీజన్ గ్రాండ్ గా సక్సెస్ అవ్వడంతో రెండో సీజన్ కూడా మరింత గ్రాండ్ గా చేశారు. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ లో చంద్రబాబు, ప్రభాస్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలవగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షోని మరో రేంజ్ కి తీసుకెళ్లారు. బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి పార్ట్ 1ని ఫిబ్రవరి 2న రిలీజ్ చేశారు ఆహా. ఈ ఎపిసోడ్ ఎక్కువ స్ట్రీమింగ్ టైం సాధించి సరికొత్త రికార్డులని సెట్ చేసింది. ఈ ఎపిసోడ్ లో సరదాగా మాట్లాడుతూ, సినిమాలు, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. తాజాగా ఫిబ్రవరి 9 గురువారం రాత్రి బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 రిలీజ్ చేశారు.

బాలయ్య-పవన్ ఎపిసోడ్ షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి అటు బాలయ్య అభిమానులు, ఇటు పవన్ అభిమానులు హంగామా చేశారు. వరుసగా పోస్టర్లు, ఫోటోలు, ప్రోమోలు.. వదులుతూ ఆహా టీం కూడా ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చింది. తాజాగా రిలీజ్ అయిన పవన్ బాలయ్య ఎపిసోడ్ తో ఈ సీజన్ గ్రాండ్ గా ముగిసింది. మొదటి పార్ట్ లో అంతా సినిమాలు, పర్సనల్ లైఫ్ ఉంటే రెండో పార్టీ లో చాలా వరకు పాలిటిక్స్ గురించి ఉంది. దీంతో ఈ ఎపిసోడ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

కొన్ని నెలల క్రితం జనసేన పార్టీ తరపున రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకొని మరణించిన కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు కౌలు రైతుల భరోసా యాత్ర పేరుతో ఆ కుటుంబాలకు డబ్బులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఇటీవల కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ వైజాగ్ వచ్చినప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం జరగకుండా అడ్డుకొని పవన్ ని హోటల్ లో నిర్బంధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇది స్టేట్ లో పెద్ద గొడవగా మారింది. తాజాగా ఈ ఇష్యూ గురించి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించారు.

Unstoppable : ఆ విషయంలో పవన్ ని అభినందించిన బాలయ్య..

దీనికి పవన్ కళ్యాణ్ సమాధానమిస్తూ.. నేనేం మాట్లాడినా ప్రభుత్వానికి ఇబ్బందే. నేను మాములుగా చూసినా వాళ్ళకి తప్పుగానే కనపడుతుంది. నేను వైజాగ్ కి రాకుండా ఉండటానికి చాలా ఇబ్బందులు పెట్టారు. అధికార యంత్రాంగం హద్దులు దాటి మరీ నన్ను ఇబ్బందులు పెట్టారు. అయినా నేను వచ్చాను. ఆ కార్యక్రమం జరగకుండా ఆపాలని అందరూ ట్రై చేశారు. నన్ను హోటల్ లోనే నిర్బంధించారు. నా పార్టీ కార్యకర్తలు 15 మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు. ఒక చిన్న పాపని తీసుకొని ఆ కార్యక్రమం కోసం వచ్చిన ఓ జనసేన మహిళ మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారంటే వాళ్ళ గురించి అర్ధం చేసుకోండి. నేను ఎదుగుతూ ఉంటే తొక్కేయడం వారి వ్యూహంలో భాగం. నియంతృత్వం, ఆధిపత్య ధోరణి, ఎవరూ ఎదురు చెప్పకూడదు అనేది ఈ ప్రభుత్వం పాలసీ. మనకి ప్రభుత్వం చేసే పనులు నచ్చకపోతే చెప్పాలి, నేను చెపితే అది ప్రజలకి దగ్గరవుతుంది, అందుకే ప్రభుత్వం నా మీద ఇలా చేస్తుంది అంటూ ఏపీ ప్రభుత్వాన్ని డైరెక్ట్ గానే విమర్శించారు. దీంతో పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో చర్చగా మారాయి. దీనిపై వైసీపీ నాయకులు ఘాటుగా విమర్శిస్తున్నారు.