Pawan Kalyan: కిరణ్ అబ్బవరం సినిమా “నేను మీకు బాగా కావాల్సినవాడిని” ట్రైలర్‌ని విడుదల చేసిన పవన్ కళ్యాణ్..

గోదారి యాసతో, నటనలో చలాకీతనం చూపిస్తూ, మన పక్కింటి కుర్రాడిలా కనిపించే హీరో కిరణ్ అబ్బవరం. అతను నటించిన "నేను మీకు బాగా కావాల్సినవాడిని" చిత్రం ఈ నెల 16న విడుదలకు సిద్దం కాగా మూవీ మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. కాగా ఈ సినిమా ట్రైలర్ ని ఈరోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ చేతులు మీదుగా విడుదల చేయించింది మూవీ టీం.

  • Updated on- September 8, 2022 / 06:55 PM IST

Nenu Meeku Baga Kavalsinavadini

Pawan Kalyan:  గోదారి యాసతో, నటనలో చలాకీతనం చూపిస్తూ, మన పక్కింటి కుర్రాడిలా కనిపించే హీరో కిరణ్ అబ్బవరం. టాలీవుడ్ లో వరుసపెట్టి యూత్ ఫుల్ మూవీస్ చేసుకుంటూ యూత్ లో తనకంటూ ఒక ఇమేజ్ ని సంపాదించుకుంటున్నాడు. అతను నటించిన “నేను మీకు బాగా కావాల్సినవాడిని” చిత్రం ఈ నెల 16న విడుదలకు సిద్దం కాగా మూవీ మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నెక్ట్స్ మూవీ రిలీజ్ వాయిదా.. కారణం ఏమిటో?

కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్యా నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. హీరో కిరణ్ కి జంటగా సంజనా ఆనంద్ నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తుండగా S.V. కృష్ణ రెడ్డి, సోను ఠాకూర్, సంగీత, బాబా భాస్కర్, సమీర్, సిద్దర్ద్ మీనన్ తదితరులు నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ట్రైలర్ ని ఈరోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ చేతులు మీదుగా విడుదల చేయించింది మూవీ టీం.

ట్రైలర్ బట్టి చూస్తే హీరో కిరణ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఒకటి సిటీలో క్యాబ్ డ్రైవర్ కాగా, మరొకటి పల్లెటూరి అల్లుడి పాత్ర. సిటీలో హీరో కిరణ్ కు సోను ఠాకూర్ పరిచయం కావడం, ఆమెకు ఏదో సమస్య ఉండడం, ఆ సమస్యను పరిష్కరించడానికి ఆమె ఇంటికి వెళ్లడం, చివరకి ఆ సమస్యను పరిష్కరించాడా లేదా అన్నదే సినిమా కథాంశం అని తెలుస్తుంది. చూడాలి ఈ సినిమా కిరణ్ కు ఎంతటి విజయాన్ని అందిస్తుందో. ఇక ట్రైలర్ చూసిన పవన్ కళ్యాణ్ మూవీ టీంని అభినందిచాడు.