Pawan Kalyan: మొదలైన పవన్-సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ సినిమా..!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. ఈ సినిమా పూర్తిగాక ముందే పవన్ తన కెరీర్‌లోని నెక్ట్స్ చిత్రాలను కూడా వరుసబెట్టి స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ‘ఉస్తా్ద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ అనే సినిమాలను స్టార్ట్ చేశాడు.
- Anil Aaleti
- Published On : February 22, 2023 / 01:08 PM IST
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. ఈ సినిమా పూర్తిగాక ముందే పవన్ తన కెరీర్‌లోని నెక్ట్స్ చిత్రాలను కూడా వరుసబెట్టి స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ‘ఉస్తా్ద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ అనే సినిమాలను స్టార్ట్ చేశాడు.
Pawan Kalyan : సూసైడ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి పవన్ ఇచ్చిన మోటివేషన్..
ఇక తాజాగా అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ, మరో సినిమాను కూడా స్టార్ట్ చేశాడు పవన్. తమిళ యాక్టర్ కమ్ డైరెక్టర్ సముధ్రఖని డైరెక్షన్‌లో ‘వినోదయ సీతం’ అనే సినిమాను తెలుగులో పవన్ రీమేక్ చేస్తాడనే వార్త గతకొద్ది రోజులుగా జోరుగా వినిపిస్తోంది. కాగా, నేడు ఈ సినిమాను అఫీషియల్‌గా స్టార్ట్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో మరో హీరోగా సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నాడు.
Pawan Kalyan : పవన్ కి స్థలం ఇచ్చానని నా ఇల్లు కూలగొట్టారు.. ఇప్పటం గ్రామం పెద్దావిడ ఆవేదన
ఈ కొత్త సినిమా ప్రారంభోత్సవాన్ని చాలా సింపుల్‌గా నిర్వహించింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తుండగా, త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాతో పవన్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అందుకుంటుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
