Pawan Kalyan : సూసైడ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి పవన్ ఇచ్చిన మోటివేషన్..

ఒక హెల్త్ ప్రాబ్లమ్ తో సఫర్ అయి, డిప్రెషన్ లోకి వెళ్లి, సూసైడ్ దాకా వెళ్లి ఇప్పుడు ఇంత పెద్ద స్టార్ అయ్యవంటే మాములు విషయం కాదు అంటూ బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ని అభినందించాడు. అలాగే ఇటీవల చాలా మంది చిన్న చిన్న వాటికి సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నారు. అలాంటి వాళ్లకి...............

Pawan Kalyan : సూసైడ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి పవన్ ఇచ్చిన మోటివేషన్..

Pawan Kalyan motivation words in Balakrishna Unstoppable

Pawan Kalyan :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షో సూపర్ గా సక్సెస్ అయింది. మొదటి సీజన్ గ్రాండ్ గా సక్సెస్ అవ్వడంతో రెండో సీజన్ కూడా మరింత గ్రాండ్ గా చేశారు. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ లో చంద్రబాబు, ప్రభాస్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలవగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షోని మరో రేంజ్ కి తీసుకెళ్లారు. బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి పార్ట్ 1ని ఫిబ్రవరి 2న రిలీజ్ చేశారు ఆహా. ఈ ఎపిసోడ్ ఎక్కువ స్ట్రీమింగ్ టైం సాధించి సరికొత్త రికార్డులని సెట్ చేసింది. ఈ ఎపిసోడ్ లో సరదాగా మాట్లాడుతూ, సినిమాలు, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. తాజాగా ఫిబ్రవరి 9 గురువారం రాత్రి బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 రిలీజ్ చేశారు.

బాలయ్య-పవన్ ఎపిసోడ్ షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి అటు బాలయ్య అభిమానులు, ఇటు పవన్ అభిమానులు హంగామా చేశారు. వరుసగా పోస్టర్లు, ఫోటోలు, ప్రోమోలు.. వదులుతూ ఆహా టీం కూడా ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చింది. తాజాగా రిలీజ్ అయిన పవన్ బాలయ్య ఎపిసోడ్ తో ఈ సీజన్ గ్రాండ్ గా ముగిసింది. మొదటి పార్ట్ లో అంతా సినిమాలు, పర్సనల్ లైఫ్ ఉంటే రెండో పార్టీ లో చాలా వరకు పాలిటిక్స్ గురించి ఉంది. దీంతో ఈ ఎపిసోడ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఎపిసోడ్ లో పాలిటిక్స్ తో పాటు మరోసారి పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాలని కూడా మాట్లాడారు. దీంట్లో పవన్ ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. తనకు చిన్నప్పుడు ఓ అనారోగ్యం ఉందని, దాని వల్ల చాలా బాధపడ్డాడని, సూసైడ్ చేసుకుందామని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. బాలకృష్ణ.. చిన్నప్పటి నుంచి మొహమాటంతో, అందరికి దూరంగా, సైలెంట్ గా ఉంటూ, ఎక్కువ చదవకుండా ఉన్న నువ్వు ఇప్పుడు పవర్ స్టార్ గా ఎలా మారావు అని అడిగాడు. దీనికి పవన్ కళ్యాణ్ సమాధానమిస్తూ.. చిన్నప్పుడు తనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్ ప్రాబ్లమ్స్, ఒంటరిగా ఉండటం, తాను సూసైడ్ చేసుకోవాలనుకొని ట్రై చేయడం, వదిన, నాగబాబు కాపాడటం.. ఇవన్నీ చెప్పి తర్వాత ఎలా బయటపడింది అని తెలిపాడు.

ఒక హెల్త్ ప్రాబ్లమ్ తో సఫర్ అయి, డిప్రెషన్ లోకి వెళ్లి, సూసైడ్ దాకా వెళ్లి ఇప్పుడు ఇంత పెద్ద స్టార్ అయ్యవంటే మాములు విషయం కాదు అంటూ బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ని అభినందించాడు. అలాగే ఇటీవల చాలా మంది చిన్న చిన్న వాటికి సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నారు. అలాంటి వాళ్లకి నువ్వు ఏమన్నా చెప్పు అని పవన్ కళ్యాణ్ ని అడిగాడు బాలయ్య.

Pawan Kalyan : చిన్నప్పుడు ఆ వ్యాధితో బాధపడ్డా.. అన్నయ్య రివాల్వర్ తో కాల్చుకొని చచ్చిపోదాం అనుకున్నా..

దీంతో పవన్ మాట్లాడుతూ.. నాలెడ్జ్, సక్సెస్.. ఇంకేదైనా రాత్రికి రాత్రి రాదు. మనల్ని ఇంకొకరితో పోల్చుకోకూడదు. ఏదో ఒకటి నేర్చుకోవాలి, నేర్చుకుంటూనే ఉండాలి, ఖాళీగా అస్సలు ఉండకూడదు. ఉద్యోగం పోతే ఉద్యోగం సంపాదించొచ్చు, లవ్, పేరెంట్స్, స్టడీస్.. ఇలా ఏ విషయంలోనైనా క్షణికావేశంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవద్దు. అవన్నీ మళ్ళీ మారతాయి. చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఒకటి అంటారు. అవి అస్సలు పట్టించుకోకూడదు. ఎవరో ఒకరు ఉంటారు మనకోసం, ఎవరూ లేకపోతే మనమే మోటివేట్ అవ్వాలి. డిప్రెషన్ ఉన్నవాళ్లు ఇవాళ ఉండేది రేపు ఉండదు అని ఒకటే గుర్తుంచుకోవాలి. ఏదైనా మారిపోతుంది అని చెప్పాడు.