Renu Desai : ఒక్క రోజులోనే పవన్ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లిన రేణూదేశాయ్.. అకీరా హీరో ఎంట్రీ లేనట్లేనా..?
పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ సినీ ఎంట్రీ ఉండదా? రేణూ దేశాయ్ ఇన్‌స్టా స్టోరీ అభిమానులను కలవరపెడుతుంది.
- gum 95921
- Published On : August 22, 2023 / 02:58 PM IST
Pawan Kalyan son Akira Nandan hero entry Renu Desai post viral
Renu Desai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులంతా అకీరా నందన్ (Akira Nandan) ఎంట్రీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు (K Raghavendra Rao) తాజాగా చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వడం, అది చూసిన పవన్ అభిమానులు ఎంతో హ్యాపీగా ఫిల్ అవ్వడం జరిగింది. అసలు ఇంతకీ ఆ పోస్టులో ఏముంది..?
Mega 157 : మెగా 157.. సోషియో ఫాంటసీ కథతో మరింత కొత్తగా రాబోతున్న మెగాస్టార్
రాఘవేంద్రరావు తన మనవడు కార్తికేయ మరియు అకీరాతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. ఇద్దరు యూఎస్ లోని ఫిలిం స్కూల్ జాయిన్ అవ్వబోతున్నారని పేర్కొన్నాడు. దీంతో త్వరలోనే అకీరా డెబ్యూట్ ఉండబోతుందని ఆర్టికల్స్ రావడం మొదలయ్యాయి. ఈ విషయమే పవన్ అభిమానులను ఫుల్ ఖుషీ చేసింది. అయితే ఇంతలో రాఘవేంద్రరావు తన అకౌంట్ నుంచి ఆ పోస్ట్ ని డెలీట్ చేయడం, ఆ తరువాత రేణూ దేశాయ్ తన ఇన్‌స్టా స్టోరీతో పెద్ద బాంబు పిలిచింది.
Mega 156 : చిరంజీవి నెక్స్ట్ సినిమా కూతురి నిర్మాణంలోనే.. బర్త్ డే విషెష్ చెప్తూ మెగా 156 అనౌన్స్..
రేణూ దేశాయ్ తన స్టోరీలో ఇలా రాసుకొచ్చింది. “అకీరాకి ప్రస్తుతం యాక్టింగ్ పై ఎటువంటి ఇంటరెస్ట్ లేదు. భవిషత్తులో తనకి ఏమన్నా ఆసక్తి కలుగుతుందా? అనేది నేను చెప్పలేను. అకీరా సినీ ఎంట్రీ ఉంటే, దాని గురించి తెలియజేసే మొదటి వ్యక్తిని నేనే. కాబట్టి ఇప్పుడు ప్రచారం చేస్తున్న వార్తలను ఆపండి” అంటూ పేర్కొంది. ఇక ఈ పోస్ట్ చూసిన పవన్ అభిమానుల్లో ఆందోళన మొదలయింది.
Pawan Kalyan son Akira Nandan hero entry Renu Desai post viral
రాఘవేంద్రరావు పోస్ట్ చూసి సంతోష పడేలోపే రేణూ దేశాయ్ ఇలా చెప్పడం పవన్ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. మరి అకీరా సినీ ఎంట్రీ ఉంటుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే. అయితే అకీరా మాత్రం తన తండ్రి లాగానే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ, జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ, అలాగే సంగీతం పై కూడా ప్రావిణ్యం సంపాదించుకుంటూ వస్తున్నాడు.
