Mega 156 : చిరంజీవి నెక్స్ట్ సినిమా కూతురి నిర్మాణంలోనే.. బర్త్ డే విషెష్ చెప్తూ మెగా 156 అనౌన్స్..

భోళా శంకర్ తర్వాత మెగా 156 సినిమా కూతురు సుస్మిత కొణిదెల(Susmita Konidela) నిర్మాణంలో ఉంటుందని బంగార్రాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణ(Kalyan Krishna) దర్శకత్వంలో ఉంటుందని వార్తలు వచ్చాయి.

Mega 156 : చిరంజీవి నెక్స్ట్ సినిమా కూతురి నిర్మాణంలోనే.. బర్త్ డే విషెష్ చెప్తూ మెగా 156 అనౌన్స్..

Chiranjeevi Mega 156 Movie announced under Susmita Konidela Gold Box Entertainments Productions

Updated On : August 22, 2023 / 9:53 AM IST

Chiranjeevi Next Movie : చిరంజీవి భోళా శంకర్(Bholaa Shankar) సినిమా ఫ్లాప్ అవ్వడంతో నెక్స్ట్ సినిమా ఏంటా అని అంతా ఎదురు చూస్తన్నారు. చిరంజీవి ఇప్పటికైనా రీమేక్స్ ఆపేయాలని, ఒరిజినల్ స్టోరీలతో రావాలని అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటున్నారు. చిరంజీవి చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయని టాక్ నడుస్తుంది. ఇవాళ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో రెండు సినిమాల అప్డేట్స్ రానున్నాయి.

భోళా శంకర్ తర్వాత మెగా 156 సినిమా కూతురు సుస్మిత కొణిదెల(Susmita Konidela) నిర్మాణంలో ఉంటుందని బంగార్రాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణ(Kalyan Krishna) దర్శకత్వంలో ఉంటుందని వార్తలు వచ్చాయి. తాజాగా సుస్మిత కొణిదెల ఆధ్వర్యంలోని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్(Gold Box Entertainments) చిరంజీవి నెక్స్ట్ సినిమా తమ నిర్మాణంలోనే అని, మెగా 156 సినిమాని నిర్మిస్తున్నామని ప్రకటించింది.

Nagarjuna : నాగార్జున ఇప్పటికి మన్మథుడిగా ఉండటానికి కారణం అదేనా.. డైలీ రాత్రి పడుకునేటప్పుడు అది తినాల్సిందేనట..

చిరంజీవికి బర్త్ డే విషెష్ చెప్తూ సినిమాని ప్రకటించారు కానీ డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం ప్రకటించలేదు. దీంతో కళ్యాణ్ కృష్ణ అవునా కాదా అనే సందేహం ఏర్పడింది. మరి సాయంత్రం వరకు ఇంకో అప్డేట్ ఇచ్చి డైరెక్టర్ ని కూడా ప్రకటిస్తారేమో చూడాలి. ఇక ఈ సినిమా మరో నెల రోజుల్లో వర్క్ మొదలవుతుందని దసరా తర్వాత షూటింగ్ ఉంటుందని సమాచారం.