Pawan Kalyan : పోలీసుల మీద చెయ్యి వెయ్యకూడదు.. ఇప్పటం ఇష్యూ గురించి చెప్పిన పవన్

పవన్ కారుపై కూర్చొని మంగళగిరి నుంచి ఇప్పటం గ్రామానికి వెళ్లడం వైరల్ గా మారింది. పవన్ కారుపై కూర్చొని వెళ్లిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటో చూపించి పవన్ ని ఈ గొడవేంటి అని అడిగాడు బాలయ్య...............

Pawan Kalyan Spoke about Ippatam village issue in Unstoppable show

Pawan Kalyan :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షో సూపర్ గా సక్సెస్ అయింది. మొదటి సీజన్ గ్రాండ్ గా సక్సెస్ అవ్వడంతో రెండో సీజన్ కూడా మరింత గ్రాండ్ గా చేశారు. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ లో చంద్రబాబు, ప్రభాస్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలవగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షోని మరో రేంజ్ కి తీసుకెళ్లారు. బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి పార్ట్ 1ని ఫిబ్రవరి 2న రిలీజ్ చేశారు ఆహా. ఈ ఎపిసోడ్ ఎక్కువ స్ట్రీమింగ్ టైం సాధించి సరికొత్త రికార్డులని సెట్ చేసింది. ఈ ఎపిసోడ్ లో సరదాగా మాట్లాడుతూ, సినిమాలు, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. తాజాగా ఫిబ్రవరి 9 గురువారం రాత్రి బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 రిలీజ్ చేశారు.

బాలయ్య-పవన్ ఎపిసోడ్ షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి అటు బాలయ్య అభిమానులు, ఇటు పవన్ అభిమానులు హంగామా చేశారు. వరుసగా పోస్టర్లు, ఫోటోలు, ప్రోమోలు.. వదులుతూ ఆహా టీం కూడా ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చింది. తాజాగా రిలీజ్ అయిన పవన్ బాలయ్య ఎపిసోడ్ తో ఈ సీజన్ గ్రాండ్ గా ముగిసింది. మొదటి పార్ట్ లో అంతా సినిమాలు, పర్సనల్ లైఫ్ ఉంటే రెండో పార్టీ లో చాలా వరకు పాలిటిక్స్ గురించి ఉంది. దీంతో ఈ ఎపిసోడ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

పవన్ కళ్యాణ్ కొన్ని నెలల క్రితం ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ సభ కోసం అక్కడి గ్రామస్థులు స్థలం ఇచ్చారు. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం ఆ గ్రామంలో పవన్ కి స్థలం ఇచ్చిన వాళ్ళ ఇళ్ళని రోడ్డు వెడల్పు చేస్తున్నాం అనే సాకుతో కూలగొట్టింది అని విమర్శలు వచ్చాయి. దీంతో పవన్ సీరియస్ అయి ఇప్పటం గ్రామానికి వెళ్లి అక్కడి గ్రామస్థులని పరామర్శిద్దాం అనుకున్నాడు. వాళ్లకి డబ్బులు కూడా సహాయం చేద్దాం అనుకున్నాడు. కానీ పోలీసులు చివరి నిమిషంలో పర్మిషన్ ఇవ్వకుండా మంగళగిరి ఆఫీస్ లో పవన్ ని నిర్బంధించారు. ఆ సమయంలో పవన్ కారుపై కూర్చొని మంగళగిరి నుంచి ఇప్పటం గ్రామానికి వెళ్లడం వైరల్ గా మారింది. పవన్ కారుపై కూర్చొని వెళ్లిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటో చూపించి పవన్ ని ఈ గొడవేంటి అని అడిగాడు బాలయ్య.

Pawan Kalyan : 15మందిపై అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు.. వైజాగ్ లో తనని నిర్బంధించిన ఇష్యూ పై మాట్లాడిన పవన్

పవన్ కళ్యాణ్ దీనిపై స్పందిస్తూ.. ఇది వైజాగ్ గొడవకు కొనసాగింపు ఇష్యూ. నాకు జనసేన ఆవిర్భావానికి ఇప్పటం గ్రామస్థులు స్థలం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం ఎవిక్షన్ నోటీసులు ఇచ్చారు. ఇలాంటివి సడెన్ గానే గుర్తొస్తాయి ఆ ప్రభుత్వానికి. వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు కాబట్టి వెళ్లి పరామర్శిద్దాం అనుకున్నా. మొదట పోలీసులు పర్మిషన్ ఇచ్చి తర్వాత వెళ్లనివ్వలేదు. పోలీసులు మంగళగిరి ఆఫీస్ లోనే ఆపేసారు. కార్ లో వెళ్లొద్దు, రోడ్డు మీదకు రాకూడదు, జనాల్లోకి వెళ్ళకూడదు, మాట్లాడొద్దు.. ఇలా చాలా చెప్పారు. పోలీసులని కొట్టాలన్నంత కోపం వచ్చింది. కాని వాళ్ళ మీద చెయ్యి చేసుకోకూడదు. డ్యూటీలో ఉన్న ప్రభుత్వ అధికారి మీద చేయి చేసుకుంటే మళ్ళీ అదో కేసు. ఇంక ఏమీ చేయొద్దు అంటే నాకు తిక్క వచ్చి కారు మీద ఎక్కి వెళ్తా, ఎవరు ఆపుతారో చూద్దాం అని వెళ్ళా. నా మీద ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అని పోలీసులతో అన్నా. అప్పుడే అలా కార్ మీద ఎక్కి వెళ్ళాను అని తెలిపారు.